Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ హ‌వా ముందు నిల‌బ‌డ‌తాడా?

ఇప్పుడు మ‌రోసారి వ‌రుణ్ ధావ‌న్ అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొన‌బోతున్నాడు. అత‌డు న‌టించిన‌ బేబీ జాన్ కి పుష్ప 2 నుంచి ట్ర‌బుల్ ఎదురు కానుంద‌ని విశ్లేషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 5:30 PM GMT
పుష్ప‌రాజ్ హ‌వా ముందు నిల‌బ‌డ‌తాడా?
X

బాలీవుడ్ లో జూనియ‌ర్ స‌ల్మాన్ గా పాపుల‌ర‌య్యాడు వ‌రుణ్ ధావ‌న్. కానీ ఇటీవ‌ల అత‌డు న‌టించిన సినిమాలు ఆశించిన స్థాయి విజ‌యాల్ని ద‌క్కించుకోలేదు. అతడి న‌ట‌న‌కు క్రిటిక‌ల్ గా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నా కానీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ల‌క్ ఫేవ‌ర్ చేయ‌డం లేదు. అత‌డి సినిమాలు విడుద‌ల‌య్యే స‌మ‌యంలో పెద్ద హీరోల సినిమాలు పోటీగా విడుద‌ల‌వ్వ‌డం కూడా ప‌లుమార్లు ప‌రాజ‌యానికి కార‌ణ‌మైంది.

గ‌తంలో స్ట్రీట్ డ్యాన్సర్ 3D విడుద‌లైన స‌మ‌యంలో అజ‌య్ దేవ‌గ‌న్ 'తానాజీ 3డి' భారీ స్థాయిలో విడుద‌లైంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డంతో ధావ‌న్ సినిమా బాక్సాఫీస్ రేసులో వెన‌క‌బ‌డింది. ఓంరౌత్ - అజ‌య్ దేవ‌గ‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన తానాజీ ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచింది. అలాగే పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌లైన 'భేదియా'తో పోటీప‌డుతూ దేవ‌గ‌న్ న‌టించిన‌ 'దృశ్యం 2' విడుద‌లైంది. ఇది కూడా వ‌రుణ్ ధావ‌న్ సినిమాని పెద్ద‌ దెబ్బ కొట్టింది. క్రైమ్ డ్రామా దృశ్యం 2 ముందు భేధియా క‌లెక్ష‌న్ల ప‌రంగా డీలా ప‌డింది. వ

ఇప్పుడు మ‌రోసారి వ‌రుణ్ ధావ‌న్ అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొన‌బోతున్నాడు. అత‌డు న‌టించిన‌ బేబీ జాన్ కి పుష్ప 2 నుంచి ట్ర‌బుల్ ఎదురు కానుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద హ‌వా సాగిస్తోంది. ఇప్పుడున్న స్పీడ్ మునుముందు కూడా కొన‌సాగించే వీలుంది. దీంతో ధావ‌న్ కి ఇబ్బందులు క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. బేబి జాన్ క్రిస్మ‌స్ బ‌రిలో విడుద‌ల కానుండ‌గా ఇప్ప‌టికే వ‌రుణ్ ధావ‌న్ టీమ్ ప్ర‌చారం కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంద‌ని స‌మాచారం.

ఉత్త‌రాదిన పుష్ప 2 త‌గ్గేదేలే అంటూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఇలాంటి స‌మ‌య‌లో బేబి జాన్ రిలీజ్ యంగ్ హీరో ధావ‌న్‌కి ప్ల‌స్సా మైన‌స్సా? అన్న‌దానిపై చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాతోనే సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. కీర్తి క‌ల‌ల‌కు బ్రేక్ ప‌డుతుందా? అంటూ.. చ‌ర్చ సాగుతోంది.