హీరోయిన్‌ని ఇర్రిటేట్ చేసిన హీరో ప్రవర్తన
అయితే ఇలాంటి ఒక సంఘటన నర్గీస్ ఫక్రీకి ఎదురైంది. నర్గీస్ ఆ సన్నివేశంలో అసౌకర్యం ఫీలవ్వడానికి వరుణ్ ప్రవర్తన కారణం.
By: Tupaki Desk | 15 Jan 2025 5:30 PM GMTకథానాయికల అందచందాలకు హీరోలు మంత్రముగ్ధం అవ్వడం, షాట్ చిత్రీకరణ సమయంలో తన్మయంలోకి వెళ్లిపోవడం ఇప్పుడే కొత్త కాదు. సీనియర్ హీరోలు చాలామంది సెట్లో సీన్ కట్ చెప్పాక కూడా కథానాయికలతో మైమరిచిపోయి సీన్‌లో లీనమై బయటకు రాని సందర్భాలున్నాయి. కొందరు సీనియర్ హీరోల అసభ్య ప్రవర్తన గురించి కథానాయికలు ఆరోపించారు.
ఇటీవల యువహీరో వరుణ్ ధావన్ పైనా అలాంటి ఫిర్యాదులు చాలా ఉన్నాయి. అతడు తన కథానాయికలతో హద్దులు దాటి ప్రవర్తించాడని విమర్శలున్నాయి. ఇటీవల బేబీ జాన్‌లో కొన్ని సన్నివేశాలలో సహనటితో టూమచ్ గా ప్రవర్తించాడని కామెంట్లు వినిపించాయి. కియారా అద్వానీ, అలియా భట్, జాన్వి కపూర్‌తో సహా పలువురు నటీమణులు అతడితో సన్నివేశంలో నటించేప్పుడు షాకింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో తమ అభ్యంతరం వ్యక్తం చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.
అయితే ఇలాంటి ఒక సంఘటన నర్గీస్ ఫక్రీకి ఎదురైంది. నర్గీస్ ఆ సన్నివేశంలో అసౌకర్యం ఫీలవ్వడానికి వరుణ్ ప్రవర్తన కారణం. ఓవైపు వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ కట్ చెప్పినా నర్గీస్‌ను పట్టుకోవడం ద్వారా వరుణ్ సన్నివేశంలో డీప్ గా లీనమైపోయి కనిపించాడు. సూపర్ హీరో చిత్రం `మై తేరా హీరో`లో ఓ దృశ్యంలో అతడు అలా నటించాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అయితే ఈ సన్నివేశంలో నటించిన తర్వాత వరుణ్ నవ్వుతూ కనిపించాడు.
కానీ ఈ పాత వీడియో వీక్షించాక నెటిజనులు వరుణ్ ని ఘాటుగా విమర్శిస్తున్నారు. వరుణ్ తన కథానాయికలతో గతంలో ఎలా ప్రవర్తించాడో కూడా గుర్తు చేస్తున్నారు. ఇటీవల వాంపైర్ చిత్రాలతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదగాలని వరుణ్ ధావన్ ప్రయత్నించాడు. కానీ ఈ సినిమా పెద్ద ఫ్లాపైంది. ఇటీవల బేబి జాన్ తో మరో ఫ్లాప్ అందుకున్నాడు వరుణ్.