బన్నీ అరెస్ట్.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే?
ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలువురు ఖండించగా.. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ స్పందించారు. ఘటనలో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదన్నారు.
By: Tupaki Desk | 13 Dec 2024 11:26 AM GMTహైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కొడుకు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ ఘటనకు సంబంధించి బన్నీపై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
అయితే శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు.. బన్నీని అరెస్ట్ చేశారు. కేసు విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలువురు ఖండించగా.. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ స్పందించారు. ఘటనలో ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదన్నారు.
వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బేబీ జాన్ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ అరెస్ట్ పై ఆయన మాట్లాడారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. సేఫ్టీ ప్రోటోకాల్ విషయంలో విఫలమైతే అది కేవలం నటుడి బాధ్యత మాత్రమే కాదని వరుణ్ ధావన్ జైపూర్ లో జరిగిన ఈవెంట్ లో వ్యాఖ్యానించారు.
అయితే పుష్ప 2 విడుదల ముందు రోజు జరిగిన సంఘటన విషాదకరమైనదని అన్నారు. ఆ విషయంలో తాను సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు. కానీ తొక్కిసలాట ఘటనలో ఒకరిపై మాత్రమే నిందలు వేయలేమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సంధ్య థియేటర్ లో ఏం జరిగింది?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాగా.. డిసెంబరు 4వ తేదీన వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. సంధ్య థియేటర్ లో కూడా ఏర్పాటు చేశారు.
ఆ సమయంలో అక్కడికి అల్లు అర్జున్ రాగా.. తొక్కిసలాట జరిగింది. దీంతో విషాదం చోటు చేసుకుంది. బన్నీ వచ్చిన సమయంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.