Begin typing your search above and press return to search.

మట్కా నెంబర్ వన్ ట్రేండింగ్..

మొత్తానికి, మట్కా టీజర్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో టీజర్‌ ఇప్పటికే 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ సంపాదించింది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 9:53 AM GMT
మట్కా నెంబర్ వన్ ట్రేండింగ్..
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘మట్కా’ టీజర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వేరే వైవిధ్యమైన సినిమాలతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న వరుణ్‌ తాజా చిత్రం మట్కా టీజర్‌ విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వైరా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎస్‌ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.

1960 బ్యాక్‌డ్రాప్‌లో వింటేజ్ విశాఖపట్నం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ‘మట్కా కింగ్’గా ఆకట్టుకుంటున్నాడు. తన క్యారెక్టర్ వాసు పాత్రలో వరుణ్‌ తేజ్ కనిపించిన విధానం ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర కోసం వరుణ్‌ తేజ్‌ అనేక మేకోవర్‌ లు తీసుకొని, పాత్రలోని వేర్వేరు దశలను అద్భుతంగా ప్రదర్శించారని టీజర్‌ ద్వారా స్పష్టమైంది.

ముఖ్యంగా టీజర్‌లో కనిపించిన క్లాసీ, మాస్ లుక్స్ వరుణ్‌ తేజ్‌ నటనకు మరింత హైలైట్‌ గా నిలిచాయి. టీజర్‌ ప్రారంభంలో “ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కరే స్పందిస్తారు. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు.. నాలాంటోళ్లు.. నువ్వు ఆ తొంభై పైసలు సంపాదించే ఒక్కడివి.. 99 మందిలో ఒక్కడిగా మిగిలిపోకు.. నీకు ఆ దమ్ము ఉంది” అనే డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.

అలాగే, టీజర్‌లో వరుణ్‌ తేజ్‌ వింటేజ్ లుక్‌ లో, క్లాసీ గా కనిపించడం సినిమా పట్ల భారీ అంచనాలు కలిగిస్తుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ కూల్ రెట్రో లుక్‌తోనూ, మాస్ లుక్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టీజర్‌ చివర్లో ఉన్న యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మరింతగా ఆసక్తిగా ఉంచాయి. ఇక మట్కా చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరి పాత్రలు సినిమాకు మరింత ఆకర్షణను తీసుకురావడం ఖాయం. జీవి ప్రకాశ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ టీజర్‌ కి మరింత బలం చేకూర్చింది.

మొత్తానికి, మట్కా టీజర్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో టీజర్‌ ఇప్పటికే 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ సంపాదించింది. నెగెటివ్ ట్రెండ్ లేకుండా టీజర్ తోనే అందరిలో సినిమా పట్ల అంచనాలు బాగానే పెరిగాయి. మట్కా చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్‌ 14న భారీగా విడుదల చేయనున్నారు. మరి ‘మట్కా’ టీజర్ కు వచ్చిన అద్భుత స్పందన సినిమా విడుదల సమయంలో ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.