మెగావారసుడు మళ్లీ రంగంలోకి!
ఆ సంగతి పక్కన బెడితే తాజాగా మేర్లపాక గాంధీ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరుగుతుంది.
By: Tupaki Desk | 23 March 2025 12:35 PM ISTమెగా వారసుడు వరుణ్ తేజ్ కి కొంత కాలంగా సరైన సక్సెస్ పడని సంగతి తెలిసిందే. సోలో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అది కమర్శియల్ గా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అలాంటి హిట్ కోసమే తపిస్తున్నాడు. గత సినిమా `మట్కా` పాన్ ఇండియాలో రిలీజ్ అయిన అంచనాలు తల్లకిందులైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారసుడు రిలాక్స్ మోడ్ లో కి వెళ్లిపోయాడు. మేర్లపాక గాంధీతో ప్రాజెక్ట్ మినహా కొత్త కథలేవి విన్నట్లు కూడా ప్రచారంలోకి రాలేదు.
ఆ సంగతి పక్కన బెడితే తాజాగా మేర్లపాక గాంధీ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరుగుతుంది. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందట. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే కామెడీ హారర్ థ్రిల్లర్ కథ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. `కొరియన్ కనకరాజు` అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఈ టైటిల్ పై సోమవారం క్లారిటీ వస్తుంది. ఈ సినిమా విజయం వరుణ్ కి ఎంత కీలకమో అంతకన్నా ఎక్కువగా గాంధీకి కీలకం.
కొంత కాలంగా ఆయనకు సరైన విజయాలు పడలేదు. దీంతో దర్శకుడిగా అవకాశాలు కూడా తగ్గాయి. కమర్శియల్ డైరెక్టర్ గా గాంధీకి పేరుంది. కానీ నేడు పాన్ ఇండియా ట్రెండ్ సహా స్టోరీల నేపథ్యంలో రేసులో వెనుక బడ్డాడు. పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన వరుణ్ తేజ్ ఫెయిలయ్యాడు. ఇది పూర్తిగా రీజనల్ మూవీ. ఈ ప్రాజెక్ట్ పై వరుణ్ -గాంధీ చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. అన్ని వర్గాలకు కనెక్ట్ అయ్యే కథాంశంగా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎగ్జోటిక్ లోకేషన్లలోనే ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్ తో పాటు, కొరియా, వియత్నాంలో మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి హారర్ కామెడీ చిత్రానికి విదేశీ లొకేషన్లకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది క్లారిటీ రావాలి. సాధారణంగా ఇలాంటి సినిమాలు సెట్స్ లో చిత్రకరిస్తారు. కానీ గాంధీ ఆ ఛాన్స్ తీసుకోకుండా మేజర్ షెడ్యూల్స్ విదేశాల్లో ప్లాన్ చేయడం విశేషం.