ఫన్నీ వీడియోతో వరుణ్ భలే సర్‌ప్రైజ్ ఇచ్చాడే
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
By: Tupaki Desk | 26 March 2025 6:17 AMహిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే వరుణ్ ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయోగాలు చేసినా అవేవీ తనకు కలిసి రావడం లేదు. వరుణ్ అకౌంట్ లో హిట్ పడి చాలా సినిమాలవుతుంది.
మట్కా సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే ఆ సినిమా మరింత ఘోరంగా ఫ్లాపైంది. దీంతో తర్వాతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త వహించి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి ఎంటర్టైనర్లు తీసిన మేర్లపాక గాంధీకి అవకాశమిచ్చాడు వరుణ్. మేర్లపాక గాంధీతో వరుణ్ చేయనున్న సినిమా అతని కెరీర్లో 15వ మూవీగా తెరకెక్కుతుంది.
ఇండో కొరియన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పై మేకర్స్ ఓ ఫన్నీ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో కమెడియన్ సత్య చేసిన కామెడీ చాలా ఫన్నీగా ఉంటూ అందరినీ అలరిస్తుంది. చీకట్లో ఉన్న వరుణ్ తేజ్ దగ్గరికెళ్లి సత్య వెలుగు, చీకటి కామన్ బయటికి వచ్చేయ్ బ్రో అంటే అంత సీన్ లేదు సమ్మర్ కదా కరెంట్ పోయింది అంటాడు వరుణ్. ఆ మాట అనగానే కరెంట్ వచ్చేస్తుంది. దానికి సత్య చూశావా బ్రో నేను రాగానే నీ లైఫ్ లోకి వెలుగొచ్చింది అంటాడు.
ఇంతకీ తర్వాతి సినిమా ఏంటి బ్రో అని వరుణ్ ని అడిగితే ఈసారి మనది ఎక్స్‌ప్రెస్ వే, మేర్లపాక గాంధీతో సినిమా అని వరుణ్ చెప్పిన వెంటనే దానికంటే చీకట్లో ఉండటమే బెటర్ బ్రో అని వెళ్లిపోబోతుంటే అంతలో డైరెక్టర్ గాంధీ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే వావ్.. సూపర్ డైరెక్టర్ అంటూ గాంధీని ఉద్దేశించి అంటాడు సత్య.
మరి సినిమాలో నేనున్నానా అంటే నువ్వు లేకుండా సినిమానా సత్యా అని డైరెక్టర్ అంటాడు. అయితే నాకు కథ చెప్పండి అనగానే ఒక కొరియన్ అమ్మాయిని పిలిచి చేసిన కామెడీ భలేగా వర్కవుట్ అయింది. ఈ ప్రోమోలో సినిమా జానర్ గురించి కూడా రివీల్ చేసింది చిత్ర యూనిట్. కొరియన్ బ్యాక్ డ్రాప్ లో హార్రర్ కామెడీ జానర్ గా తెరకెక్కనుందని, షూటింగ్ ఆల్రెడీ మొదలైందని చెప్తూ ప్రోమో తోనే సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు.