Begin typing your search above and press return to search.

వరుణ్ గత 3 సినిమాల నష్టాలు.. మట్కాతో కొట్టాల్సిందే..

వరుణ్ తేజ్ నుంచి చివరిగా 'గని', 'గాండీవదారి అర్జున', 'ఆపరేషన్ వాలంటైన్' సినిమాలు రిలీజ్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   13 Nov 2024 5:45 AM GMT
వరుణ్ గత 3 సినిమాల నష్టాలు.. మట్కాతో కొట్టాల్సిందే..
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి 'మట్కా' సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్స్ లోకి వస్తోంది. వరుణ్ తేజ్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీలలో ఒకటిగా ఈ సినిమా రూపొందింది. సినిమాపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కచ్చితంగా తనకి మంచి సక్సెస్ ఇస్తుందని వరుణ్ తేజ్ కూడా భావిస్తున్నారు.

అలాగే గత సినిమాల వైఫల్యాల కారణంగా అతను సాలిడ్ సక్సెస్ కొట్టాల్సిందేనని ట్రేడ్ పండితులు సైతం అంటున్నారు. వరుణ్ నుంచి చివరగా వచ్చిన మూడు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ కెరియర్ ఆరంభం నుంచి డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ మూవీస్ చేస్తున్నాడు ఆడియన్స్ కి కొత్తదనం ఉన్న కథలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ ప్రయత్నం అతనికి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు ఇవ్వడం లేదు. వరుణ్ తేజ్ నుంచి చివరిగా 'గని', 'గాండీవదారి అర్జున', 'ఆపరేషన్ వాలంటైన్' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక్కో సినిమాని 40-45 కోట్ల బడ్జెట్ తో తెరకేకించారు. గ్రాండియర్ గానే సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. అయితే ఈ సినిమాలు ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

వరుణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాలుగా నిలిచాయి. 'గని' మూవీ లాంగ్ రన్ లో 8 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన 'గాండీవదారి అర్జున' కేవలం 3 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది. వీటి తర్వాత తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ అయిన 'ఆపరేషన్ వాలంటైన్' మూవీ 9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని మాత్రమే లాంగ్ రన్ లో రాబట్టింది. ఈ సినిమాలు వరుణ్ తేజ్ మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ చూపించాయి.

అయిన కూడా 'మట్కా' సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. నిర్మాత టేబుల్ ప్రాఫిట్ తో మూవీ రిలీజ్ చేస్తున్నారు. సినిమా మీద పాజిటివ్ టాక్ ఉంది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డారు. మూడు విభిన్న వయస్సులలో ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నిజజీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ మట్కా కథను రాసుకున్నారు. కోల్ కత్తాకు చెందిన ఒక మట్కా కింగ్ జీవితాన్ని సౌత్ ఇండియన్ వాతావరణంకు తగ్గట్టుగా డిజైన్ చేసినట్లు నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమాలో 1980 కాలానికి సంబంధించిన వైజాగ్ వాతావరణం కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ అయితే మంచి హైప్ క్రియేట్ చేసింది. మరి కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి.