Begin typing your search above and press return to search.

వరుణ్ మెడలో ఎర్ర కండువా.. 'మట్కా'కు అవే హైలెట్!

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌.. ప్రస్తుతం మట్కా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Sep 2024 5:15 AM GMT
వరుణ్ మెడలో ఎర్ర కండువా.. మట్కాకు అవే హైలెట్!
X

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌.. ప్రస్తుతం మట్కా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ.. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే మట్కా సినిమాలో వరుణ్ తేజ్.. ఇప్పటి వరకు ఎవరూ చూడని డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు.


రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో వరుణ్‌ తేజ్‌ చేతిలో సిగరెట్‌ పట్టుకుని కనిపిస్తుండగా.. టేబుల్‌పై ఓ వైపు పిస్తోల్‌, మరోవైపు డబ్బు ఉన్న పోస్టర్ ఉంది. మూవీలో ఆయన రోల్ నేమ్ వాసుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం.. కాకినాడలో షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ చేస్తున్నారు. ఇదే ఫైనల్ షెడ్యూల్ అంట.

అందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. షూటింగ్ లోని వరుణ్ పిక్ కూడా చక్కర్లు కొడుతోంది. అందులో వరుణ్ మాస్ లుక్ లో మెడలో ఎర్ర కండువాతో కనిపించారు. ఫస్ట్ లుక్ కు, రీసెంట్ పిక్ కు ఫుల్ వేరియేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే మేకర్స్.. 1980 బ్యాక్‌ డ్రాప్‌ లో వైజాగ్‌ లొకేషన్స్‌ ను రీక్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్ ఎఫ్ సీలో వేసిన ఓల్డ్ వైజాగ్ సెట్ లో కీలక సీన్స్ ను మేకర్స్ షూట్ చేస్తున్నారు.

అయితే ఓల్డ్ వైజాగ్ సెట్స్ లో తీసిన సీన్లు.. సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుణ్ మేకోవర్ సూపర్ గా ఉందని చెబుతున్నారు. మూవీపై అంచనాలు పెరుగుతున్నాయని అంటున్నారు. సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వరుణ్ తేజ్‌ కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన నాలుగు గెటప్స్‌లో కనిపించబోతున్నారని టాక్.

ఇక సినిమా విషయానికొస్తే. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్‌ ఆర్‌ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. కిషోర్ కుమార్ డీవోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పీ రవి శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి మట్కా మూవీ ఎలా ఉంటుందో చూడాలి.