"ప్లీజ్ గివ్ డేట్స్ అమ్మ" కీర్తి కి ట్వీట్ చేసిన హీరో
కీర్తి సురేష్ తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు కమిట్ అవుతూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 1 Feb 2024 6:57 AM GMTకీర్తి సురేష్ తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు కమిట్ అవుతూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా తమిళ సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ అమ్మడు వరుణ్ దావన్ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతోంది.
తాజాగా కీర్తి సురేష్ చీర కట్టు లో ఫోటోలను షేర్ చేసింది. న్యూ బిగినింగ్ అంటూ వరుణ్ దావన్ కొత్త సినిమా హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేసింది. దాంతో కీర్తి సురేష్ కు వరుణ్ దావన్ రిక్వెస్ట్ గా ప్లీజ్ గివ్ డేట్స్ అమ్మ (దయచేసి డేట్స్ ఇవ్వు అమ్మ) అంటూ కామెంట్ పెట్టాడు.
కీర్తి సురేష్ పెట్టిన పోస్ట్ కు వరుణ్ దావన్ కామెంట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షింది. కొద్ది నిమిషాల్లోనే ఆ కామెంట్ వైరల్ అయ్యింది. కీర్తి సురేష్ పాపం బాలీవుడ్ సినిమాలకు డేట్లు ఇవ్వడం లేదా.. వరుణ్ దావన్ చాలా రోజులుగా కీర్తి సురేష్ డేట్ల కోసం వెయిట్ చేస్తున్నాడా అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అట్లీ నిర్మాణంలో కలీస్ దర్శకత్వంలో వరుణ్ దావన్ హీరోగా కీర్తి సురేష్ మరియు వామికా గబ్బి హీరోయిన్స్ గా సినిమా రూపొందుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి కొంత మేరకు షూటింగ్ కూడా జరిగిందనే వార్తలు వస్తున్నాయి. కానీ కీర్తి సురేష్ బిజీగా ఉండటం వల్ల డేట్లు ఇవ్వలేక పోతుందేమో అని వరుణ్ దావన్ కామెంట్ ని చూస్తే అనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలుగులో ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. కానీ తమిళంలో మాత్రం రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది. చేతిలో పెద్దగా సినిమాలు లేకున్నా కూడా ఎందుకు కీర్తి సురేష్ డేట్లు ఇవ్వడంలో విఫలం అవుతుంది అంటూ కొందరు వరుణ్ దావన్ కి మద్దతుగా కీర్తి సురేష్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వరుణ్ దావన్ కామెంట్ కి కీర్తి సురేష్ ఎలా రియాక్ట్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో మొత్తానికి వరుణ్ దావన్ మరియు కీర్తీ సురేష్ సినిమాకు సంబంధించిన పోస్ట్, కామెంట్ వైరల్ అవుతోంది.