Begin typing your search above and press return to search.

శ్రీవారి సేవలో మెగా కొత్త జంట

దర్శనం అనంతరం రంగనాయకుల మండపం లో వరుణ్ తేజ్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చారు

By:  Tupaki Desk   |   14 Aug 2024 12:11 PM GMT
శ్రీవారి సేవలో మెగా కొత్త జంట
X

మెగా హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి అయిన వెంటనే స్వామివారిని దర్శించుకోవాలని భావించినా కూడా పలు కారణాల వల్ల ఈ జంట శ్రీవారి దర్శనంకు ఇన్నాళ్ల సమయం పట్టిందని సన్నిహితులు అంటున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో లావణ్య త్రిపాఠితో కలిసి వరుణ్‌ తేజ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. వరుణ్‌ తేజ్ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లాంచన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనంకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపం లో వరుణ్ తేజ్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. పెళ్లి తర్వాత మొదటి సారి వరుణ్ తేజ్ తిరుమల శ్రీవారి దర్శనానికి రావడంతో మీడియా వారు పెద్ద ఎత్తున కవరేజ్ కి ఎగబడ్డారు. వరుణ్ మరియు లావణ్య ల ఫోటోలు మరియు వీడియోలను తీసుకునేందుకు పదుల సంఖ్యలో మీడియా వారితో పాటు సామాన్య భక్తులు కూడా ఎగబడ్డారు. స్వామి వారి దర్శనం తర్వాత మీడియా మాట్లాడించేందుకు ప్రయత్నించినా వరుణ్ అక్కడ ఏమీ మాట్లాడుకుండా వెళ్లి పోయాడు.

ప్రస్తుతం వరుణ్‌ తేజ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... మట్కా షూటింగ్‌ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా హడావుడిగా షూటింగ్‌ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈయన చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుచుతూ వస్తున్నాయి. దాంతో మట్కా పై మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ లో కూడా మట్కా పై ఆశలు ఉన్నాయి. పెళ్లి తర్వాత చేస్తున్న సినిమా మట్కా. కనుక దీని ఫలితం ఎలా ఉంటుందా అనేది అందరిలో కూడా ఆసక్తి ఉంది.

ఇక లావణ్య త్రిపాఠి సినిమాలతో పాటు సిరీస్ లు కూడా వరుసగా చేస్తూనే ఉంది. ఇటీవలే లావణ్య త్రిపాఠి మిస్‌ పెర్ఫెక్ట్‌ వెబ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో వైపు హీరోయిన్‌ గా కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు మానేయాల్సి రావచ్చు అనే టాక్ వినిపించింది. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం సినిమాలు మానేయలేదు కదా... ఇంతకు ముందు కంటే ఎక్కువ సినిమాలు మెగా ఫ్యామిలీ ప్రోత్సాహం తో చేస్తున్నట్లు ఆమె సన్నిహితులు మరియు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు.