కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం!
ఇటీవల కొన్ని ఫ్లాపులు ఎదురైనా కానీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ఇవేవీ ప్రభావితం చేయడం లేదు
By: Tupaki Desk | 24 July 2024 5:10 PM GMTఇటీవల కొన్ని ఫ్లాపులు ఎదురైనా కానీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ఇవేవీ ప్రభావితం చేయడం లేదు. అతడు ఓవైపు వరుస చిత్రాలకు సంతకాలు చేస్తూనే, ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఆనందంగా ఉన్నాడు. అతడు ప్రేమించి పెళ్లాడిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠితో ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నాడు. వరుణ్ - లావణ్య జంట ఎక్కడ కనిపించినా ఒకరికోసం ఒకరుగా మైమరిచిపోయి ఎంతో జాలీగా కనిపిస్తారు. అలాంటి ఒక ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలో ఆ ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు ఆరాధనగా చూసుకుంటూ మైమరిచిపోయి కనిపించారు. ఈ దృశ్యాన్ని చూడగానే కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం..! అంటూ అభిమానులు ఆనంద డోలికళ్లు మునిగి తేల్తున్నారు. మరికొందరు ప్రేమ ఎంత మధురం.. ! అంటూ మరో క్లాసిక్ హిట్ గీతాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. కలకాలం ఈ జంట ఇలాగే ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. వరుణ్ - లావణ్య కపుల్ గోల్స్ సెట్ చేశారు.. ఇక అనుసరించాల్సిందేనంటూ అభిమానులు జోష్ ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ అందమైన జంట ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో దూసుకుపోతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 1970ల నాటి పీరియాడిక్ ఫిల్మ్ `మట్కా`లో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. దీనికి పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబరు నాటికి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అటుపైనా వరుణ్ రెండు కొత్త సినిమాలకు సంతకం చేసాడని కథనాలొస్తున్నాయి. ఒక చిత్రానికి గాంధీ మేర్లపాక దర్శకత్వం వహించనున్నారు. క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరి వారంలో కొరియాలో ప్రారంభం కానుంది. షూటింగ్‌లో ఎక్కువ భాగం కొరియాలో జరగనుంది. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి కానుంది.
విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించే మరో చిత్రం షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. AI లవ్ స్టోరీ ఇది అని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది.. మేర్లపాక గాంధీ చిత్రం కొరియన్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత వరుణ్ తన తదుపరి సినిమా షెడ్యూల్ ని పూర్తి చేయడానికి వెళతారని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఆ తర్వాత ఈ రెండు సినిమాల షూటింగ్‌లను ఒకేసారి హైదరాబాద్‌లో కొనసాగించనున్నారని తెలిసింది.