ఇటలీ టుస్కానీకి చేరుకున్న వరుణ్-లావణ్య
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మరికొద్ది రోజుల్లో భార్యాభర్తలు కానున్నారు.
By: Tupaki Desk | 22 Oct 2023 11:29 AM GMTవరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మరికొద్ది రోజుల్లో భార్యాభర్తలు కానున్నారు. ఈ జంట నవంబర్ 1న ఇటలీ- టస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోనున్నారు. ఇది ఒక చారిత్రాత్మక గ్రామం. తరువాత రిసార్ట్‌గా మారింది. ఇక్కడ సెలబ్రిటీ పెళ్లిల్లు ఇటీవల హాట్ టాపిక్.
ఇదే వెన్యూలో వరుణ్-లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మెగా ఇంట ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి బాజాలకు సమయమాసన్నమైంది. ఇప్పటికే నవవధూవరులు టుస్కానీకి బయలుదేరినట్లు ఇన్స్టాగ్రామ్ లో తెలిపారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు.
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9 న హైదరాబాద్‌లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. నవంబర్ 1న వివాహం అవుతుంది. వివాహ వేడుకలు హల్దీ, మెహందీ, సంగీత్ తో మొదలై నాలుగు రోజుల వివాహంతో పూర్తవుతుంది. అనంతరం పార్టీ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కామినేని, పవన్ కళ్యాణ్, నాగబాబు ఆయన కుటుంబం, అల్లు అర్జున్, అల్లు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వివాహానికి హాజరుకానున్నారు.
వరుణ్ తేజ్ ఇన్స్టాగ్రామ్ లో తన ప్రయాణానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసాడు. విమానం కిటికీ నుండి చూస్తున్న ఫోటో ఇది. అతడు ఇప్పటికే టుస్కానీలో అడుగుపెట్టాడు. పెళ్లి కోసం ఉపాసన కామినేని కూడా టుస్కానీ చేరుకున్నారు. ఆమె డబుల్ రెయిన్బో ఫోటోను షేర్ చేసింది. లొకేషన్‌ను టస్కానీ, ఇటలీ అని ట్యాగ్ చేసింది.
పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నెల రోజుల పాటు ప్రపంచ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని వారి స్నేహితులు, సహోద్యోగుల కోసం స్థానికంగాను రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.