Begin typing your search above and press return to search.

ఇటలీలో పెళ్లి ఎందుకు.. వరుణ్‌ ఇంట్రస్టింగ్ ఆన్సర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ కొన్ని నెలల క్రితం హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   20 Feb 2024 12:57 PM GMT
ఇటలీలో పెళ్లి ఎందుకు.. వరుణ్‌ ఇంట్రస్టింగ్ ఆన్సర్‌
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ కొన్ని నెలల క్రితం హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి సుదీర్ఘ ప్రేమ ప్రయాణం పెద్దల అంగీకారంతో వైవాహిక బంధం గా మారింది. లావణ్య త్రిపాఠి మరియు వరుణ్‌ ల వివాహం ఇటలీలో వైభవంగా జరిగింది.

ఇండియాలో కాకుండా ఇటలీలో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటూ చాలా మంది చాలా రకాలుగా వరుణ్ ను ప్రశ్నించారు. తాజాగా ఆయన నుంచి సమాధానం లభించింది. వరుణ్ చెప్పిన సమాధానం కు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా సంతృప్తి చెందుతున్నారు.

వరుణ్ తేజ్ తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్‌ సినిమాను మార్చి 1న విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడాడు. ఆ సమయంలో వరుణ్‌ ఎందుకు ఇటలీలో వివాహం చేసుకోవాల్సి వచ్చింది అనే విషయమై స్పందించాడు.

వరుణ్‌ మాట్లాడుతూ... మా ఫ్యామిలీ చాలా పెద్దది. కుటుంబంలోని అంతా కూడా చాలా బిజీగా ఉంటారు. ఇక్కడ పెళ్లి అయితే ఎవరి పనుల్లో వారు ఉంటూ పెళ్లిని ఎక్కువగా ఎంజాయ్‌ చేయడం కుదరదు. అదే ఇటలీలో అయితే పనులన్నీ కూడా పక్కకు పెట్టాల్సి ఉంటుంది. కనుక పెళ్లిని ఎంజాయ్ చేయడం కోసం ఇటలీలో ప్లాన్‌ చేశామని వరుణ్ అన్నాడు.

ఇండియాలో అయితే ఎవరి పనుల్లో వారు ఉంటారు. పెళ్లి సమయానికి వచ్చి నాలుగు అక్షింతలు వేస్తారు. అదే విదేశాల్లో అయితే పూర్తి సమయం కూడా పెళ్లికే కేటాయిస్తూ ఉంటారు. ఇది మంచి నిర్ణయం కదా అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.