Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు.. వరుణ్ లావణ్య ల వీడియో వైరల్‌

తాజాగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అయిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి లు ఇటలీ వెళ్లారు. వారు హైరాబాద్‌ లో ఫ్లైట్‌ ఎక్కారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 7:56 AM GMT
పెళ్లికి ముందు.. వరుణ్ లావణ్య ల వీడియో వైరల్‌
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ తాను సుదీర్ఘ కాలం గా ప్రేమిస్తున్న లావణ్య త్రిపాఠిని నవంబర్‌ 1న పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం వైభవంగా జరగడంతో పెళ్లి ఎలా జరుగుతోందో... అతిథులు ఎవరో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పెళ్లి విదేశాల్లో వైభవంగా జరగబోతుంది అంటూ మెగా కాంపౌండ్ నుంచి క్లారిటీ వచ్చేసింది.

సాధారణంగా సినిమాల షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లే మెగా ఫ్యామిలీ హీరోలు, ఇతర కుటుంబ సభ్యులు ఈసారి వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీల యొక్క పెళ్లి కోసం విదేశీ ప్రయాణంకు సిద్ధం అయ్యారు. ఇటలీ లో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలు అయ్యాయి. కొంత మంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడకు చేరుకుని మరీ ఏర్పాట్లలో మునిగి ఉన్నారు.

తాజాగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అయిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి లు ఇటలీ వెళ్లారు. వారు హైరాబాద్‌ లో ఫ్లైట్‌ ఎక్కారు. ఆ సమయంలో శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌ లో ఇద్దరూ సందడి చేశారు. కలిసి వచ్చిన వరుణ్, లావణ్య లు కలిసి ఎయిర్ పోర్ట్‌ లో నడుచుకుంటూ విమానం ఎక్కారు.

పెళ్లికి ముందు ఇలా ఎయిర్ పోర్ట్‌ లో వీరిద్దరూ ఇలా కనిపించడం తో మీడియా వారు వారి కెమెరాలకు పని చెప్పారు. పెళ్లి కోసం ఇలా ఇద్దరు కలిసి వెళ్లడం కేవలం వీరికి మాత్రమే చెల్లిందని... ఇదే ప్రేమ వివాహం లో ఉన్న బ్యూటీ అన్నట్లుగా చాలా మంది సోషల్‌ మీడియాలో వైరల్‌ వీడియో కు కామెంట్స్ చేస్తున్నారు.