పెళ్లికి ముందే ఇటలీ వీధుల్ని చుట్టేస్తోన్న జోడీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం పనులు మొదలైపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ గా మొదలయ్యాయి
By: Tupaki Desk | 25 Oct 2023 11:09 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం పనులు మొదలైపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ గా మొదలయ్యాయి. అప్పటి నుంచి ఏదో ఈవెంట్ తో ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. పెళ్లి తేదిని అధికారికంగా ప్రకటించలేదు గానీ నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా లావణ్య-వరుణ్ అప్పుడే ఇటలీకి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇటలీ వీధుల్లో జోడీ షాపింగ్ లు చేస్తోంది. జంటగా కారుపై షికార్లు చేస్తున్నారు. నచ్చిన షాప్ దగ్గర ఆగి షాపింగ్ చేస్తున్నారు. వరుణ్ కాబోయే సతీమణిని దగ్గరుండి మరీ తీసుకెళ్తున్నాడు. పెళ్లికి అవసరమైన వాటన్నింటిని సమకూర్చుకునేందుకు ముందుగానే వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన వస్త్రాలు అన్నింటిని మనీష్ మల్హోత్రా స్టోర్ నుంచి తీసుకున్నారు.
పెళ్లి దుస్తులు...మోహందీ ..సంగీత్ వేడుకకు సంబంధించిన షాపింగ్ అంతా ముంబైలోనే చేసారు. పెళ్లికి ఇంకా వారం రోజులే గడువు ఉండటంతో ముందుగా ఇటలీకి చేరుకుని అవసరమైనవి అన్నీ పర్చే జ్ చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు కూడా ముందుగానే ఇటలీకి చేరుకునే అవకాశం ఉంది. మెగా ఫ్యామిలీకి సంబంధించి జరుగుతోన్న తొలి డెస్టినేషన్ వెడ్డింగ్ ఇది. చరణ్..బన్నీ పెళ్లి హైదరాబాద్ లోనే గ్రాండ్ గా నిర్వహించారు.
కానీ వరుణ్ విషయంలో ఆ ఛాన్స్ తీసుకోలేదు. మరి ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎవరి ఆలోచన మేరకు జరుగుతుంది! అన్నది ఆసక్తికరం. ప్రస్తుతం వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' షూటింగ్ కూడా పూర్తిచేసాడు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే 'మట్కా' షూటింగ్ జరుగుతోంది. పెళ్లి నేపథ్యంలో కొద్ది రోజులు వాయిదా వేసారు. ఇక లావణ్య చేతిలో సినిమాలు లేవు. మరి పెళ్లి తర్వాత ఛాన్సులు వస్తే నటిస్తుందా? లేదా? అన్నది చూడాలి.