వరుణ్-లావణ్య పెళ్లి డేట్ లాక్.. ఆ రోజే!
ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు చేస్తుకుంటున్నారు. అయితే నిజానికి వీరి పెళ్లి ఆగస్టులోనే జరగాల్సి ఉంది.
By: Tupaki Desk | 22 Aug 2023 6:01 AM GMTమెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగే క్షణాలు దగ్గర పడ్డాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే తమ ప్రేమను ఇంట్లో చెప్పి.. తమ రెండు కుటుంబాల సమక్షంలో జూన్ 9వ నిశ్చితార్థం చేసుకున్నారు. నాగబాబు ఇంట్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ.. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కానీ తాజాగా కాస్త క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. పెళ్లి ఫిక్స్ అయినట్లు సమాచారం అందింది.
వరుణ్-లావణ్య పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతుందనే విషయంపై మొదటి నుంచే మెగా అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పెళ్లి వివరాలు గురించి ఫ్యాన్స్ ఆరా తీస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ జంట పెళ్లి వివరాలు గురించి రోజుకో వార్త బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త జంట తమ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టారు.
ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు చేస్తుకుంటున్నారు. అయితే నిజానికి వీరి పెళ్లి ఆగస్టులోనే జరగాల్సి ఉంది. కానీ వరుణ్ తేజ్ సినిమాల రిలీజ్.. నిహారిక డివోర్స్ వ్యవహారం వంటి కారణాలతో కాస్త వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం.. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి నవంబరు నెలలో ఉండనుందని తెలిసింది.
నవంబర్ 1వ తేదీని ఫిక్స్ చేసినట్లు సమాచారం అందింది. ఇరు కుటుంబల సమక్షంలో ఇటలీలో జరగనుందట. మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో ఇది జరగనుందట. మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్లికి వెళ్లబోతున్నారట. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఒక్కరే తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాకపోవచ్చని అంటున్నారు.
ఇకపోతే వరుణ్ తేజ్.. ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది రానుంది. ఇందులో వరుణ్ సెక్యూరిటీ ఆఫీసర్గా కనిపించనున్నారు. దాదాపు రూ.50కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొందింది.