Begin typing your search above and press return to search.

వరుణ్​-లావణ్య పెళ్లి.. పెద్ద ప్లానే వేశారుగా!

అయితే వీరి పెళ్లి ఇటలీ లో జరగనుందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   1 Aug 2023 6:56 AM GMT
వరుణ్​-లావణ్య పెళ్లి.. పెద్ద ప్లానే వేశారుగా!
X

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన డిఫరెంట్ స్టోరీస్​ను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్​లో మందుకెళ్తున్నారు. కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000 కఎంపీహెచ్, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్, ఘని, ఎఫ్ 3 చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.

అయితే వీటిలో మిస్టర్​, అంతరిక్షం సినిమా షూటింగ్​ సమయం లో ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడ్డారు. సోషల్​మీడియా అంతా హాట్ టాపిక్​గా మారారు. ఈ తర్వాత తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. జూన్ 9న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్​లోని నాగబాబు నివాసం లో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతుల సమక్షంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం గ్రాండ్​గా జరిగింది. కానీ పెళ్లి డేట్ మాత్రం ప్రకటించలేదు. దీంతో వీరి పెళ్లి ఎక్కడ జరుగుతుందా? ఎలా చేసుకుంటారు? వంటి విషయాలు అభిమానుల్లో ఆసక్తిరంగా మారింది.

అయితే వీరి పెళ్లి ఇటలీ లో జరగనుందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మిస్టర్ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన వరుణ్, లావణ్య అక్కడే స్నేహితులుగా మారారని తెలిసింది. అది కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారింది. కాబట్టి .. ఈ జంట కలిసి చోటే పెళ్లి చేసుకోవాల ని డిసైడ్ అయ్యారట.

ప్రస్తుతం వేడుక కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ఫెయిరీ స్టైల్​లో ఈ జంట వివాహం చేసుకోనున్నారట. అంటే రాజరిక పెళ్లిల తరహాలో ఈ వివాహం జరగనుందని అర్థం. రస్టిక్​ వెన్యూలో నిర్వహించనున్నారట. అలాగే ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, బంధువల, అత్యంత దగ్గర సన్నిహితుల సమక్షంలోనే జరగనుందని తెలిసింది. 50 మంది గెస్ట్​లనే ఆహ్వానించనున్నారట.

పెళ్లి అయిపోయాక హైదరాబాద్​లో గ్రాండ్​గా రిసెప్షన్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ ఈవెంట్​కు స్నేహితులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయల ప్రముఖుల ను ప్రత్యేకంగా ఇన్వైట్​ చేయనున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.