Begin typing your search above and press return to search.

వీడియో: 1.5 అ.ల వింటేజ్ కార్‌లో 6.5అ.ల పెళ్లికొడుకు

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఆ ఇద్ద‌రూ ఓ ఇంటి వార‌య్యారు

By:  Tupaki Desk   |   2 Nov 2023 5:49 AM GMT
వీడియో: 1.5 అ.ల వింటేజ్ కార్‌లో 6.5అ.ల పెళ్లికొడుకు
X

1.5అ.ల వింటేజ్ కార్‌లో 6.5అడుగుల బుల్లెట్టు లాంటి కుర్రాడి ప్రయాణం చూసారా? ఇంట్రెస్టింగ్. ఇంత‌కీ ఈ సీన్ ఎక్క‌డిది? అంటే.. నిన్న కాదు మొన్న హ‌ల్దీ, మెహందీ త‌ర్వాత బారాత్ కోసం ప్రిపేర‌వుతున్న పెళ్లికొడుకు వ‌రుణ్ తేజ్ వెడ్డింగ్ ఫెస్టివ‌ల్ కి సంబంధించిన వీడియో ఇది.

ఈ వీడియో చూడ‌గానే ఎంతో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా అన్ని ప్రీవెడ్డింగ్ వేడుక‌ల్ని నిర్వ‌హించిన మెగా కుటుంబం బారాత్ ని కూడా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇలా డోల‌క్కుల న‌డుమ ఒక‌టిన్న‌ర అడుగుల వింటేజ్ కార్ లో పెళ్లికొడుకును బారాత్ పార్టీ జ‌రిగే చోటికి తీసుకెళుతున్నార‌ని అనుకోవ‌చ్చు. ఈ ఊరేగింపు చాలా బావుంది. అయితే ఆ పొట్టి కార్ లో ఆరున్న‌ర అడుగుల వ‌రుణ్ తేజ్ ప‌ట్ట‌లేదు. అత‌డు టాప్ పై ఎక్కి మ‌రీ కూచున్నాడు ఫ‌న్నీగా. ఏది ఏమైనా ఈ వీడియోని ఇప్పుడు మెగాభిమానులు అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఆ ఇద్ద‌రూ ఓ ఇంటి వార‌య్యారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో ఈ జంట‌ వివాహం హల్దీ వేడుకతో చాలా ఉత్సాహంగా ప్రారంభం కాగా.. వేద‌పండితులు నిర్ణ‌యించిన‌ దివ్య ముహూర్తంలో వివాహం సంబ‌రంగా సాగింది. ప్రీవెడ్డింగ్ సెలబ్రేష‌న్స్ లో భాగంగా కాక్ టెయిల్ పార్టీని నిర్వహించారు. హ‌ల్దీ, మెహందీ వేడుకల నుండి అద్భుతమైన ఫోటోలు సోషల్ మీడియాలో షికార్ చేస్తున్నాయి. అభిమానుల నుండి ఈ ప్రేమ జంట‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వరుణ్ - లావణ్యల పెళ్లి వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధ‌ర‌మ్, అల్లు శిరీష్ త‌దిత‌రులు సంద‌డి చేసారు.