ఇటలీ అందాల్లో నవదంపతుల ముచ్చట్లు!
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెట్టి ధాంపత్య జీవితంలోకి అడుగు వేసారు.
By: Tupaki Desk | 2 Nov 2023 8:44 AM GMTవరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెట్టి ధాంపత్య జీవితంలోకి అడుగు వేసారు. ఇటలీలో మూడు రోజుల పెళ్లి వేడుక ఘనంగా ముగించారు. మొహందీ ..హల్దీ..సంగీత్ ..వివాహం అంటూ ఎన్నో జ్ఞాపకాలున్నాయి. కుటుంబ సభ్యులంతా ఏకమవ్వడం...ఒకేచోట మాట మంతి..సరదా సంభాషణలు..ఆటలు..పాటలు ఇలా ఒకటేంటి? ప్రతీది ఫోటో రూపంలో క్యాప్చర్ అయింది.
ఇక వరుణ్ -లావణ్యల ప్రత్యేకమైన డిజైనర్ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. వివాహమానంతరం ఆలుమగలు జంటగా ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి కుమారుడి దుస్తుల్లో వరుణ్.. వధువు లావణ్య పెళ్లి కుమార్తె దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబైన వైనం వీక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రెడ్ కలర్ సారీ డిజైనర్ లో లావణ్య ఎంతో అందంగా కనిపిస్తున్నారు.
ఒళ్లంతా బంగారంతో అలకరించారు. నుదిటిన పాపిడి బొట్టు...చెవులకు బంగారపు బుట్టులు.. మెడలో గొలుసు..నడుముకి వడ్డానం..చేతికి వేసుకున్న గాజులు ప్రతీది లావణ్యని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిది ద్దాయి. ఇక వరుణ్ తేజ్ కుర్తా దుస్తుల్లో మనోహరంగా కనిపిస్తున్నాడు. ఇద్దరి మధ్య హైట్ వ్యత్యాసం ఉన్నా చూడ చక్కని జంటగా కనిపిస్తున్నారు. పచ్చని అందాల్లో జోడీ కెమెరాకి ఫోజులిచ్చారు.
భార్య భర్తలిద్దరు ఒకరి ఒడిలో ఒకరు సేద తీరడం..చెలికాడి ఒడిలో చెలికత్తె ఆస్వాదన చూడ ముచ్చటగా ఉంది. అందమైన లొకేషన్లలో అద్భుతమైన ఫోటోలు ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. కొత్త దంపతులు కొంగొత్తగా కనిపిస్తున్నారంటూ కామెంట్లు దర్శనమిస్తున్నాయి. ఈనెల 5న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఎన్ కన్వెన్సన్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసారు. మరి రిసెప్షన్ కు ఎలాంటి డిజైనర్ దుస్తుల్లో దర్శనమిస్తారో చూడాలి.