Begin typing your search above and press return to search.

మ్యాగజైన్ పై వరుణ్- మానుషి.. గ్లోరియస్ కెమిస్ట్రీ

By:  Tupaki Desk   |   24 Feb 2024 12:00 PM GMT
మ్యాగజైన్ పై వరుణ్- మానుషి.. గ్లోరియస్ కెమిస్ట్రీ
X

మెగా ప్రిన్స్, యంగ్ హీరో వరుణ్ తేజ్.. గట్టి హిట్ కోసం కొన్నేళ్లుగా ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 1వ తేదీ థియేటర్లలోకి రానుంది. బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే వరుణ్ తేజ్.. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఎలా అయినా ఈ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ముంబయిలో మకాం వేసి మరి పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇటీవల పుల్వామా ప్రాంతానికి వెళ్లి అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు వరుణ్ నివాళులు అర్పించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.

విజయవాడతో పాటు పలు నగరాల్లో సందడి చేస్తున్నారు వరుణ్. ఇటీవల మాధవరం వెళ్లి జవాన్లకు నివాళులర్పించారు. తాజాగా వరుణ్- మానుషి.. ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ పై దర్శనమిచ్చారు. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై సందడి చేశారు. ఆ ఫొటోను మేకర్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆపరేషన్ వాలెంటైన్ జోడీతో ఈ లవ్ మంత్ మరింత మంత్రముగ్దులను చేస్తుందంటూ ట్వీట్ చేశారు.

వరుణ్ తేజ్ స్టైలిష్ బ్లాక్ షూట్ లో కనిపించగా, మానుషి బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో అట్రాక్ట్ చేస్తోంది. కవర్ పేజీపై ఇద్దరూ అదరగొట్టేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీతోనే మానుషీ చిల్లర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతుండగా.. వరుణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి రుద్రగా వరుణ్ ఈ మూవీలో కనిపించగా.. రాడార్ ఆఫీసర్ గా మానుషి సందడి చేయనుంది.

డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హుడా తెరకెక్కించిన ఈ మూవీ.. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఐదేళ్ల క్రితం పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాదులపై తీర్చుకున్న రివెంజ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.