Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ కెరియర్ ని డిసైడ్ చేయనున్న చరణ్!

నా 7వ సినిమా తర్వాత, రామ్ చరణ్ అన్న నాకు ఫోన్ చేసి స్క్రిప్ట్‌ల ఎంపిక గురించి చెప్పారు. కచ్చితంగా కొత్తగా, యూనిక్ గా ఉండే కాన్సెప్ట్ లు ఎంచుకోమని సలహా ఇచ్చారు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 4:44 AM GMT
వరుణ్ తేజ్ కెరియర్ ని డిసైడ్ చేయనున్న చరణ్!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆగష్టు 25న గాండీవదారి అర్జున మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఎండింగ్ లో ఉంది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ కాప్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి అంచనాలు మించి ఆకట్టుకుంటోంది.

ఇప్పటి వరకు టచ్ చేయని సరికొత్త పాయింట్ ని ఈ మూవీలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మన కారణంగా పర్యావరణ విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతోంది. అభివృద్ధి పేరుతో అడవులని నాశనం చేయడం, గనుల కోసం భూములని తవ్వేయడం కారణంగా మనకు మనం ఎలాంటి ప్రమాదాన్ని సృష్టించుకుంటున్నామో ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మూవీలో పర్యావరణవేత్తగా ఉన్న నాజర్ ని పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ రక్షించడం కోసం ఎలాంటి ఆపరేషన్ చేశాడు. అనేది టీజర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా వరుణ్ తేజ్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. నా 7వ సినిమా తర్వాత, రామ్ చరణ్ అన్న నాకు ఫోన్ చేసి స్క్రిప్ట్‌ల ఎంపిక గురించి చెప్పారు. కచ్చితంగా కొత్తగా, యూనిక్ గా ఉండే కాన్సెప్ట్ లు ఎంచుకోమని సలహా ఇచ్చారు.

ఒక పొజిషన్ వచ్చాక కమర్షియల్ సినిమాలు చేయాలని, ఈ జోనర్ మూవీస్ ట్రై చేయండి అని సలహాలు ఇచ్చేవారు ఎక్కువ అవుతారు. ముఖ్యంగా ప్రయోగాలు చెయ్యకుండా ప్రయత్నం చేస్తారు. వారి ఉచ్చులో పడి రొటీన్ ఫార్ములా సినిమాలు చేయొద్దని చెప్పారు. స్క్రిప్ట్‌లను ఎంచుకునే సమయంలో ఎలాంటి అంశాలు పరిగణంలోకి తీసుకోవాలో సలహా ఇచ్చారు.

అన్న ఇచ్చిన సలహా ప్రకారం ఇప్పుడు గాండీవదారి అర్జున సెలక్ట్ చేసుకొని చేస్తున్న అని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి ఈ మూవీ సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయిన దానిని రామ్ చరణ్ ఒక కారణం అవుతారనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సక్సెస్ అయితే మాత్రం చరణ్ కరెక్ట్ గా సజిస్ట్ చేశారని మెగా ఫ్యాన్స్ కూడా కితాబు ఇస్తారు.