Begin typing your search above and press return to search.

సినిమా అనేది తెలుగువారి రక్తంలోనే ఉంది: హీరో వరుణ్ సందేశ్

ప్రమోషన్స్ లో భాగంగా హీరో వరుణ్ సందేశ్ తాజాగా 'తుపాకీ డాట్ కామ్' కు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 4:44 PM GMT
సినిమా అనేది తెలుగువారి రక్తంలోనే ఉంది: హీరో వరుణ్ సందేశ్
X

'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం', 'కుర్రాడు' లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్.. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాస్త ట్రాక్ మార్చి 'నింద' వంటి యునిక్ కంటెంట్ బేస్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాజేష్ జగన్నాథం దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ థ్రిల్లర్.. జూన్ 21న థియేటర్లలో విడుదలకాబోతోంది. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థం ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా హీరో వరుణ్ సందేశ్ తాజాగా 'తుపాకీ డాట్ కామ్' కు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటుగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. ప్రీ ప్లానింగ్ లేకుండానే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినట్లు తెలిపారు. తాను యూఎస్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొత్తవారితో సినిమా తీస్తున్నారని తెలిసి ఆడిషన్ ఇచ్చానని, 'హ్యాపీ డేస్' చిత్రం కోసం సెలెక్ట్ అవ్వడం తన అదృష్టమని చెప్పారు. హీరో అవుదామని తాను రాలేదని, మంచి నటుడుగా జనాలు తనని గుర్తు పెట్టుకోవాలని అనుకున్నాన్నారు. 17 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, అన్ని సందర్భాల్లోనూ తమ ఫ్యామిలీ సపోర్ట్ గా నిలిచిందని అన్నారు. ఇప్పటికి తన సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురు చూసే ఆడియెన్స్ ఉన్నారని, 'నింద' మూవీ అందరికీ కచ్ఛితంగా నచ్చుతుందని నమ్ముతున్నానని చెప్పారు.

'నింద' సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ.. స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటాయని వరుణ్ సందేశ్ తెలిపారు. డల్లాస్ లో ఇప్పటికే రెండు షోల బుకింగ్స్ ఫుల్ అయిపోయి మరో షో యాడ్ చేస్తున్నారని, చాలా ఏళ్ళ తర్వాత ఆన్ లైన్ బుకింగ్స్ లో తన సినిమాకి ఇలా హౌస్ ఫుల్స్ చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దర్శకుడు నేరేషన్ ఇస్తున్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యానని, తనను చాలా డిఫరెంట్ వేలో కొత్తగా ప్రెజెంట్ చేశారని చెప్పారు. ఇటీవల 'చిత్రం చూడరా' అనే సినిమా చేశానని, అది జనాలకు పెద్దగా తెలియలేదన్నారు. మూవీ జానర్ ముఖ్యం కాదని, మంచి స్క్రిప్ట్ కంటెంట్ తనకి ముఖ్యమని స్పష్టం చేశారు. సినిమా అనేది తెలుగువారి రక్తంలోనే ఉందని, ఏ సినిమానైనా రెచ్చిపోయి చూస్తారని అన్నారు. వరుణ్ సందేశ్ చెప్పిన మరిన్ని విషయాలు తెలుసుకోడానికి ఈ క్రింది ఇంటర్వూ చూడండి...