30 ఏళ్ళు వెనక్కి వెళుతున్న వరుణ్
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్
By: Tupaki Desk | 22 July 2023 10:25 AM GMTమెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదటి నుంచి ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన గాండీవధారి అర్జున అనే భారీ బడ్జెట్ సినిమా చేశారు. ఆగస్టు 25న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత వరుణ్.. 'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' దర్శకుడు కరుణ కుమార్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు కరుణ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. పలాసతో సూపర్ హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా 'శ్రీదేవి సోడా సెంటర్'ను తెరకెక్కించారు.
ఇది యావరేజ్‌గా ఆడింది. ఇప్పుడు వరుణ్ తేజ్‌తో కలిసి మరో డిఫరెంట్‌గా కాన్సెప్ట్ సినిమా తీయనున్నారు. తాజాగా దీనిపై ఓ సమాచారం అందింది. దర్శకుడు మరో 30 ఏళ్ళు వెనక్కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా.. 1990ల బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని తెలిసింది. చాలా రీసెర్చ్ చేసి దర్శకుడు కథను సిద్ధం చేశారట. ఇప్పటి వరకు కెరీర్లో చేయనటువంటి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం వరుణ్ తన మేకోవర్‌ను మార్చుకోనున్నారట.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజేందర్ రెడ్డి తీగల, మోహన్ చేకూరి నిర్మించనున్నారు. ఇప్పటికీ ఈ బ్యానర్లో నాని 30 'హాయ్ నాన్న' రూపొందుతోంది. ఒకవేళ వైరా ఎంటర్టైన్మెంట్స్ అనుకున్నట్టుగానే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తే వరుణ్ కెరీర్లో ఇదే పెద్ద సినిమా అవుతుంది.
ఇకపోతే ఈ చిత్రాన్ని జులై 27న లాంఛ్ చేయనున్నారని ఇంతకముందు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్‌ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో మూవీటీమ్ ఉందట. ఆయనతో చర్చలు సాగిస్తున్నారని ఆ మధ్యలో వార్తలు వచ్చాయి. ఈ చిత్రంతో పాటు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చేయనున్నారట వరుణ్