హారర్ బాటలో టాలీవుడ్.. ఇప్పుడు మరో మెగా హీరో
ఒకప్పుడు టాలీవుడ్ లో హారర్ కామెడీ ట్రెండ్ నడిచింది. చిన్న హీరోలు ఎక్కువగా ఈ రకమైన కథలతో సక్సెస్ లు అందుకున్నారు
By: Tupaki Desk | 12 Nov 2024 4:17 AM GMTఒకప్పుడు టాలీవుడ్ లో హారర్ కామెడీ ట్రెండ్ నడిచింది. చిన్న హీరోలు ఎక్కువగా ఈ రకమైన కథలతో సక్సెస్ లు అందుకున్నారు. ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, థ్రిల్ ఈ కథలలో ఉండటంతో దర్శకులు కూడా ఈ జోనర్ ని ఎంచుకున్నారు. అలాగే ఎక్కువ లొకేషన్స్ తో పని లేకుండా పర్టిక్యులర్ ఒక ప్రాంతంలోనే సినిమా మొత్తం కంప్లీట్ చేసేయొచ్చు. బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఇది కూడా నిర్మాతలకి బెటర్ అనిపించింది.
అందుకే ఎక్కువగా చిన్న బడ్జెట్ సినిమాలు హర్రర్ కామెడీ జోనర్ లో వస్తూ ఉండేవి. అయితే రొటీన్ ఫార్ములాతోనే అన్ని కథలు వస్తూ ఉండటం ప్రేక్షకులకి కూడా ఇవి బోర్ కొట్టేశాయి. కొంతమంది మాత్రం ఈ జోనర్ సినిమాలు కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ఈ ఏడాది హిందీలో హిట్ అయిన ‘స్త్రీ 2’ మూవీ హర్రర్ కామెడీ జోనర్ లోనే తెరకెక్కింది. ఆ సినిమా ఏకంగా 600 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంది.
తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి సారి ‘ది రాజాసాబ్’ తో హర్రర్ కామెడీ జోనర్ ట్రై చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రాబోతోంది. తమిళంలో లారెన్స్ అయితే ‘కాంచన’ సిరీస్ ని హర్రర్ కామెడీలో కొనసాగిస్తున్నారు. ‘కాంచన 4’కి రంగం సిద్ధం చేశారు. అలాగే సుందర్ సి కూడా ‘అరణ్మణై’ సిరీస్ ని హర్రర్ జోనర్ లో నడిపిస్తూ సక్సెస్ లు అందుకుంటున్నాడు.
‘విరూపాక్ష’ సినిమాతో హర్రర్ థ్రిల్లర్ ట్రై చేసిన సాయి దుర్గా తేజ్ 100 కోట్ల సక్సెస్ ని అందుకున్నాడు. ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా హర్రర్ కామెడీ జోనర్ లో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందంట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందని తెలుస్తోంది.
హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఫన్ ఈ చిత్రంలో ఉండబోతోందంట. సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ రాయలసీమ స్లాంగ్ లోనే మాట్లాడుతాయని తెలుస్తోంది. అందుకే వరుణ్ తేజ్ కూడా రాయలసీమ స్లాంగ్ నేర్చుకుంటున్నారు. ప్రభాస్ ‘ది రాజాసాబ్’, తరువాత వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సినిమాలు హిట్ అయితే స్టార్ హీరోలు హర్రర్ కామెడీ లేదంటే హర్రర్ థ్రిల్లర్ కథల వైపు దృష్టి పెట్టే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి. థ్రిల్లర్ సినిమాలు చేసే వారు ఒక మిస్టీరియస్ ఎలిమెంట్ ని స్టోరీలో భాగంగా తీసుకుంటున్నారు. వాటితో హర్రర్ టచ్ కూడా అదనంగా కథలకి వస్తోంది. ప్రేక్షకులు ఎలాంటి కథలకి బాగా ఎంగేజ్ అవుతూ ఉండటంతో ఎక్కువ మంది ఈ థ్రిల్లర్ మిక్స్ అయిన హర్రర్ స్టోరీస్ చేయడానికి సిద్ధమవుతున్నారు.