16-52 మధ్య వైజాగ్ వాసు కథే మట్కా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `మట్కా` రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది.
By: Tupaki Desk | 11 Nov 2024 6:55 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `మట్కా` రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. భారీ అంచనాల మధ్య ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. డిఫరెంట్ టైటిల్ సహా లీకైన కంటెంట్..రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో ప్రేక్షకాభిమానుల్లో ఆద్యంతం ఆసక్తి పెరుగుతుంది. పైగా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ....విశాఖలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆరంభంలోనే ప్రకటించారు.
అయితే షూటింగ్ మాత్రం హైదరాబాద్ లోనే చేసారు. విశాఖకు సంబంధించిన కథ కావడంతో షూటింగ్ అంతా అక్కడే చేస్తారనుకున్నా? అవసరమైన సెట్లు అన్ని రామోజీ ఫిలిం సిటీలోనే వేసుకుని చేసారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తిర విషయాన్ని వరుణ్ రివీల్ చేసాడు. అదేంతో ఆయన మాటల్లోనే...` వాసు అనే ఓ వ్యక్తి కథ ఇది. అతని 16-52 ఏళ్ల మధ్య జీవితమే ఈసినిమా. అన్న కోసం , ప్రతీ రూపాయి కోసం కష్టపడి మట్కా కింగ్ ఎలా ఎదిగాడు అన్నదే కథ.
గద్దల కొండ గణేష్ తర్వాత కొంచెం దారి తప్పి విభిన్నంగా ప్రయత్నించాను. ఈసారి అందరికీ నచ్చే ఓ మాస్ సినిమా చేయాలనుకున్నప్పుడు కరుణ్ కుమార్ కలిసి ఈ కథ చెప్పారు. నాలో నటుడ్ని నిజాయితీగా బయటకు తీసు కొచ్చారు. సినిమా రిలీజ్ తర్వాత ఆయన గురించి ఇంకా మాట్లాడుకుంటారు. సినిమా థియేటర్లో దుమ్ముదు లుపుతుంది. విశాఖ పట్టణం అంటే సముద్రం గుర్తుకు రావాలి. లేదంటే వాసుగాడు గుర్తుకు రావాలి.
అందుకు తగ్గట్టే వాసు పాత్ర సినిమాలో ఉంటుంది. తన ప్రయాణంలో ఎంతో ఎమోషన్ కూడా ఉంది. నా సినిమా మాత్రమే మాట్లాడాలని నమ్మే వ్యక్తిని నేను. కానీ సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు బాదేస్తుంది. కానీ ఈ సినిమా అలాంటి నిరుత్సాహన్ని ఇవ్వదు అని కచ్చితంగా చెప్పగలను` అని అన్నారు.