Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ హారర్ గేమ్ షురూ

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు

By:  Tupaki Desk   |   24 March 2025 11:47 AM IST
Varun Tejs highly awaited VT15
X

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆయన ఓ హారర్ కమెడీ జోనర్‌ను ఎంచుకున్నాడు. అది కూడా ఇండో-కొరియన్ టచ్‌తో తెరకెక్కుతోంది కాబట్టి మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేసింది.

ఈ సినిమాకి VT15 అనే వర్కింగ్ టైటిల్‌ను నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హ్యూమర్ నేపథ్యంలో వినూత్నమైన కథాంశాన్ని టచ్ చేస్తూ, హారర్ షేడ్‌ను కలిపిన విధానం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించనుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ కెరీర్‌లో మరో ప్రయోగాత్మక సినిమాగా నికిచేలా ఉంది.

ఈ ఇంటెన్స్ కాన్సెప్ట్‌ను సరదాగా చెప్పాలనే ప్రయత్నమే VT15 ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఇక హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌తో రెగ్యులర్ షూటింగ్‌కు గ్రాండ్‌గా ప్రారంభం కానుందని చెప్పారు. పూజా కార్యక్రమంలో నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు పాల్గొన్నారు. వేదికపైని ఎనర్జీ, టీమ్‌కు ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తే, ఇది ఒక కొత్త తరహా ఎంటర్టైనర్ అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.

హ్యూమన్ ఎమోషన్స్‌, హారర్ థ్రిల్ల్స్, కామెడీ కలయికతో సినిమాను తెరకెక్కించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో ఈ సంస్థలు నిర్మించిన సినిమాలు బిగ్ హిట్స్‌గా నిలవడం వల్ల, ఇప్పుడు VT15పై మరింత ఆసక్తి పెరిగింది.

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటించిన గని, గంధీవధారి అర్జున వంటి ప్రయోగాత్మక సినిమాల తర్వాత, హారర్ హ్యూమర్ జోనర్‌లో ఆయన ఈసారి ఏ మేరకు మెప్పిస్తాడన్నది ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది. ఇక ఫస్ట్ లుక్‌, టీజర్ అప్‌డేట్స్ కూడా త్వరలోనే రానున్నాయి.