వరుణ్ తేజ్ రిస్క్.. ఈసారి అంతకుమించి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 11 March 2024 6:43 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శక్తి ప్రతాప్ సింగ్ హుడా తెరకెక్కించిన ఈ మూవీ.. అనుకున్నంత స్థాయిలో క్లిక్కవ్వలేదు. వరుణ్.. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో తన నటనతో అదరగొట్టేశారు. నిజమైన ఫైటర్ పైలట్ లా పాత్రలో ఒదిగిపోయారు. కానీ కంటెంట్ మాత్రం జనాలకు ఎక్కలేదు.
వరుణ్ తేజ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. సినిమా సినిమాకు చాలా డిఫరెంట్ ఉండేలా అడుగులు వేస్తున్నాడు. ఇక ఆపరేషన్ వాలెంటైన్ తో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఎదురుచూసిన వరుణ్ తేజ్ కు నిరాశే ఎదురైంది. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ మట్కాపైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు.
కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మట్కా సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం మొదలైనా.. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం కోసం బ్రేక్ ఇచ్చారు వరుణ్. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ త్వరలోనే మొదలవ్వనుంది. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ కోసం హెయిర్ కట్ చేసుకున్న వరుణ్.. మట్కా కోసం ఫుల్ హెయిర్, గడ్డం పెంచాల్సి ఉంది.
ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. త్వరలోనే సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో మెగా హీరో మూడు పాత్రలు పోషించనున్నారని తెలుస్తోంది. 20 ఏళ్ళ నవ యువకుడిగానే కాకుండా 30 ఏళ్ళ ఎనర్జిటిక్ మ్యాన్ గా హైలెట్ కాబోతున్న వరుణ్ అలాగే 50 ఏళ్ల వయసులో కూడా కనిపిస్తాడట.
ఇప్పటివరకు ఈ తరహా ప్రయోగం వరుణ్ ఎప్పుడు చేయలేదు. అయితే 50 ఏళ్ల వ్యక్తి రోల్ కోసం వరుణ్.. పొట్టను పెంచాల్సి ఉందట. ఎలాంటి ప్రోస్తేటిక్స్ ఉపయోగించకుండా రియలిస్టిక్ గా కనిపించనున్నారట. అందుకే త్వరలో జరగనున్న షెడ్యూల్ తర్వాత భారీగా గ్యాప్ తీసుకోనున్నారట. ఆ సమయంలో బాగా ఆహారం తిని తన శరీరాన్ని పెంచనున్నారట. ఆ తర్వాత ఆ రోల్ షూటింగ్ ను పూర్తిచేయనున్నారు. ఇది వరుణ్ కు కఠినమైన సవాల్ అని చెప్పవచ్చు.
ఎందుకంటే.. ఆ తర్వాత చిత్రం కోసం వరుణ్ మళ్లీ బరువు తగ్గాల్సి ఉంటుంది. అయితే మట్కా మూవీతో విజయం సాధిస్తే.. పాన్ ఇండియా లెవల్ లో వరుణ్ మేకోవర్ కు మంచి మార్కులు పడతాయి. ఇంతకుముందు.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా.. దంగల్ మూవీలోని రోల్ కోసం బాగా లావు అయ్యారు. ఆ తర్వాత అదే సినిమా కోసం సిక్స్ ప్యాక్ తో నటించారు. మొత్తానికి వరుణ్ తేజ్ ఇప్పటివరకు చేసిన పాత్రలు ఒక లెక్క.. ఇప్పుడు మట్కా క్యారెక్టర్ మరొక లెక్క అనే విధంగా ఉంది. మరి ఈ మెగా హీరో మూడు విభిన్నమైన షేడ్స్ లో ఎలా కనిపిస్తాడో చూడాలి.