పెళ్లి తర్వాత మార్పు..నోర్ముసుకుని ఉండాల్సిందే!
దీనికి వరుణ్ తనదైన శైలిలో బధులిచ్చాడు. వరుణ్ తొలుత తడబడినప్పటికీ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
By: Tupaki Desk | 23 Aug 2023 6:22 PM GMTపెళ్లి తర్వాత పెళ్లాం చెప్పినట్లు చేయాల్సిందే అన్నది మెజార్టీ వర్గం మాట. సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో ఎంతో ఓపెన్ గా ఉంటారు. చిరంజీవి..రామ్ చరణ్...రానా..వెంకటేష్ లాంటి స్టార్స్ ఈ విషయంలో తమ అభిప్రాయాల్ని బాహాటంగానే చెప్పారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముందుకు ఇలాంటి ఓ ప్రశ్న వెళ్లింది. అల్లు అర్జున్.. రామ్ చరణ్ లలో పెళ్లి అయిన తర్వాత ఎవరు మారిపోయారు? అంటూ వరుణ్ ను సుమ ప్రశ్నించింది.
దీనికి వరుణ్ తనదైన శైలిలో బధులిచ్చాడు. వరుణ్ తొలుత తడబడినప్పటికీ ఆసక్తికర సమాధానం చెప్పాడు. వాస్తవానికి ఈ ప్రశ్నను వాళ్లనే అడిగితే బాగుంటుందన్నాడు. పెళ్లి అయిన తర్వాత ఎవరైనా మారిపోవాల్సిందే. నోరు మూసుకుని ఉండాల్సిందే అన్నాడు. 'ఎఫ్-2' సినిమా దర్శకుడు అనీల్ రావిపూడి తమకు ఇదే నేర్పించాడని అన్నారు. దీంతో స్పాట్ లో ఉన్న వారంతో నవ్వుకున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ కూడా ఈవిషయంలో తండ్రుల్ని..అన్నదమ్ముల్ని ఫాలో అయిపోతున్నట్లే కనిపిస్తుంది.
మెగా వారసుడు త్వరలో పెళ్లి పీఠలెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుని ధాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇటీవలే గ్రాండ్ గా నిశ్చితార్ధం కూడా జరిగింది. డిసెంబర్ లో పెళ్లి చేసుకుంటాడని తెలుస్తోంది.
ఇక కెరీర్ పరంగా వరుణ్ తేజ్ కి తిరుగులేదు. మెగా ఫ్యామిలీలోనే డిఫరెంట్ హీరోగా ఫోకస్ అవుతున్నాడు. కమర్శియల్ సినిమాలు చేస్తూనే వైవిథ్యమైన చిత్రాలు చేస్తున్న నటుడాయన.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' లో నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. అన్ని పనులు పూర్తిచేసుకున్న సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అలాగే 'ఆపరేషన్ వాలెంటైన్' అనే దేశ భక్తి నేపథ్యం గల సినిమా చేస్తున్నాడు. ఇందులో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.