'గాంఢీవధారి అర్జున'.. బడ్జెట్ కు సెట్టయ్యే బజ్ లేదు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'గాంఢీవధారి అర్జున'. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.
By: Tupaki Desk | 20 Aug 2023 10:45 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'గాంఢీవధారి అర్జున'. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించారు. సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. మరో ఐదు రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమాపై మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొనే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం విడుదల తేదీ దగ్గర పడ్డాక బజ్ కనపడటం లేదు. సినిమా గురించి ఎవరు అంతగా మాట్లాడుకుంటున్నట్లు అనిపించడం లేదు. ప్రమోషన్స్ పర్వేలేదనిపించేలా జరుగుతున్నప్పటికీ ఓ భారీ బడ్జెట్ సినిమాకు ఉండాల్సిన హైప్ కనపడట్లేదు.
ఈ చిత్రాన్ని దాదాపు రూ. 50కోట్లు పెట్టి నిర్మించారని తెలిసింది. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సినిమాను నిర్మించారు. ఈ బ్యానర్ లో అంతకుముందు వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' కూడా భారీ హిట్ అందుకుంది. కానీ ఇప్పుడు గాండీవధారికి మాత్రం బజ్ కనపడం లేదు.
అసలే వరుణ్ భారీ హిట్ అందుకుని చాలా కాలమైంది. చివరిగా ఆయన ఎఫ్ 3తో ఏదో అలా కమర్షియల్ ఫార్మాట్ లో అదేసింది. వచ్చిన కాస్త పాజిటివ్ టాక్ కూడా దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేశ్ ఖాతాలోకి వెళ్లిపోయింది. పైగా ఈ చిత్రం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కూడా తన చివరి సినిమా ఘోస్ట్ తో భారీ డిజాస్టర్ ను అందుకున్నారు. కాబట్టి ఈ కొత్త సినిమా రిలీజ్ అవ్వడం అటు వరుణ్ తేజ్ కు ఇటు దర్శకుడికి ఎంతో ముఖ్యం. చూడాలి మరి సినిమా హిట్ అవుతుందో లేదో. కనీసం పెట్టిన బడ్జెట్ అయిన వస్తుందో లేదో.. అసలే ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ భారీ డిజాస్టర్ ను అందుకోగా, పవన్ కల్యాణ్ బ్రో పర్వాలేదనిపించింది. దీంతో కనీసం వరుణ్ అయినా భారీ హిట్ అందుకోవాలని మెగా ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన 'ఏజెంట్' ఫేమ్, యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య నటించింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. సినిమాలో నాజర్, వినయ్ రాయ్, విమలా రామన్, రోషిణి ప్రకాష్, నరైన్, అభినవ్ గోమఠం, మనీష్ చౌదరి, కల్పలత, రవి వర్మ తదితరులు నటించారు. ముఖేష్ జి ఛాయాగ్రహణం అందించారు.