వరుణ్ తేజ్ టార్గెట్ చేసి తప్పు చేసాడు!
సక్సెస్ కన్నా! ఫెయిల్యూర్ ఎన్నో విషయాలు తెలిసేలా..తెలుసుకునేలా చేస్తుంది. పనిలో మరింత శక్తి వంతంగా తయారవ్వడానికి పెయిల్యూర్ దోహద పడుతుంది.
By: Tupaki Desk | 20 Aug 2023 12:37 PM GMTసక్సెస్ కన్నా! ఫెయిల్యూర్ ఎన్నో విషయాలు తెలిసేలా..తెలుసుకునేలా చేస్తుంది. పనిలో మరింత శక్తి వంతంగా తయారవ్వడానికి పెయిల్యూర్ దోహద పడుతుంది. ఫెయిలైన వాడే మళ్లీ అలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడతారు. ఫెయిల్యూర్స్ నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ వ్యాఖ్యల్ని సమర్దించారు. తాను కెరీర్ లో ఫెయిలైన విధానాన్ని..వాటి నుంచి ఆయన నేర్చుకున్న పనితీరును విశదీకరించాడు.
తాజాగా ఆయన హీరోగా నటించిన `గని` చిత్రం పరాజయం గురించి స్పందించారు. `గని నాకు ఫస్ట్ ప్లాప్ కాదు. దానికి ముందు కొన్ని ప్లాప్ చిత్రాలున్నాయి. సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ తోనే ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. `మిస్టర్` సినిమా ప్లాప్ అయ్యాక తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నా. ఆ తర్వాత అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా `ఫిదా`..`తొలి ప్రేమ` సినిమాల విషయంలో జాగ్రత్తపడ్డా. గని ప్లాప్ ఎలా అయిందంటే? ప్రతీ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు.
కానీ ఈ సినిమాతో అందరికీ చేరువ అవ్వాలనుకున్నాం. అలా ప్రతీ అంశాన్ని కథలో భాగం చేసాం. అదే మేము చేసిన పెద్ద తప్పు. సరైన స్పోర్స్ట్ నేపథ్యం గల సినిమా తీయాలనుకున్నాం. కానీ దాన్ని తెరకెక్కిం చడంలో తప్పులు జరిగాయి. రిలీజ్ కి ముందే నాకు సీన్ అర్దమైంది. కానీ ఎక్కడో చిన్న నమ్మకం ఉండేది. కానీ సక్సెస్ అవ్వలేదు` అని అన్నాడు.
`గని` సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా విదేశాల్లో సన్నదం అయ్యాడు. బాక్సింగ్ ట్రైనింగ్ అక్కడే తీసుకున్నాడు. బాడీలో చాలా రకాల మార్పులు చేసాడు. లుక్ పరంగా చాలా కష్టపడ్డాడు. సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని కిరణ్ కొర్ర పాటి తెరకెక్కించాడు. ఇదే సినిమాతో అల్లు బాబి నిర్మాతగా పరిచయం అయ్యారు. సుధ ముద్దతో కలిసి ఈ చిత్రాన్ని 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద 6 కొట్లే తెచ్చింది.