ప్రేమతో భర్తకి లావణ్య విషెస్ ఇలా!
తాజాగా నేడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా వరుణ్ కి విషెస్ తెలియజేస్తున్నారు
By: Tupaki Desk | 19 Jan 2024 11:09 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. కమర్శియల్ చిత్రాలతో పాటు డిఫరెంట్ అటెంప్ట్ లు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని ముందుకె ళ్తున్నాడు. మెగా ఫ్యామిలీలోనే తానో డిఫరెంట్ స్టార్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. ఇటీవలే నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ జంట ఎంతో సంతో షంగా ఉంది. నవ దంపతులిద్దరు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
తాజాగా నేడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా వరుణ్ కి విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే మెగా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా విష్ చేసారు. మరి పెళ్లైన మొదటి పుట్టిన రోజు నాడు భార్య లావణ్య ఎలా విష్ చేసారు? అంటే ఆ వివరాల్లోకి వెళ్లాల్సిందే. టుస్కానీలో ఇద్దరు కలిసి ఉన్న కొన్ని ఫోటోల్ని షేర్ చేసి భర్తకి విషెస్ తెలిపారు లావణ్య.
తన మనసులో ప్రేమని..భావాలు అన్నింటిని ఇలా రాసుకొచ్చారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవి తంలో కలుసుకున్న అత్యంత అందమైన అద్భుతమైన వ్యక్తి మీరు. ఇతరులను ప్రేమించడం ..వారిపట్ల శ్రద్ద వహించే సామర్ధ్యం నిజంగా స్పూర్తిదాయకం. ఎల్లపుడూ మీలో ఈ మెరుపులు ఇలాగే ఉండాలి అంటూ రాసుకొచ్చి స్టార్ ఎమోజీని పోస్ట్ చేసారు.
ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు.. టుస్కానీ వీధుల్లో ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ... చేతిలో ఐస్ క్రీమ్ ఉన్న ఫోటోలు పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరి భర్తకు భార్య ఇచ్చిన ఖరీదైన గిప్ట్ ఏంటి? అన్నది మాత్రం రివీల్ చేయలేదండోయ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే ఆపరేషన్ వాలెంటైన్ అనే దేశ భక్తి నేపథ్యంగల చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.