మనవడి పెళ్లికి నాయనమ్మ వెళ్లడం లేదా!
మెగా వారసుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో నవంబర్ 1న జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Oct 2023 6:52 AM GMTమెగా వారసుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో నవంబర్ 1న జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు దాదాపు అంతా ఇటలీ చేరుకున్నారు. పెళ్లికి ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో మిగతా వారంతా కూడా ఈ రోజు బయల్దేరతారని తెలుస్తోంది. ముందుగా వెళ్లిన చరణ్..బన్నీ దంపతులు..నిహారిక పెళ్లి తంతుకు సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిని దగ్గరుండి చూసుకుంటున్నారు.
అలాగే లావణ్య తరుపు నుంచి కుటుంబ సభ్యులు...ఆమె స్నేహితులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తంగా పెళ్లి కార్యక్రమాలు రెండు కుటుంబాలు కలిసి చూసుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే ఈ వివాహానికి వరుణ్ తేజ్ నాయనమ్మ అంజనాదేవి హాజరు కావడం లేదని సమాచారం. దూరపు ప్రయాణం కావడంతో అంజనాదేవి వయోభారంతో ప్రయాణం చేయలేక వెళ్లలేకపోతున్నారని తెలుస్తోంది.
దీంతో పెళ్లి తంతును హైదరాబాద్ లో ఉండే వీక్షించే విధంగా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పెళ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాల నుంచి పెళ్లి వరకూ అన్ని ఈవెంట్లు ఆన్ లైన్ లో వీక్షించేలా చరణ్ అన్ని చర్యలు తీసుకుంటున్నారుట. ఇంట్లో బిగ్ స్క్రీన్ లో పెళ్లి చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసారుట. అలాగే మెగా ఫ్యామిలీ అంతా పెళ్లికి వెళ్లడంతో అంజనాదేవి ఒంటరిగా ఉండకుండా ఇంట్లో తోడు ...సహాయకుల్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇక పెళ్లి తర్వాత దంపతులు వెంటనే తిరుగు ప్రయాణం ఉంటుంది. నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రిసెప్షన్ కి సెలబ్రిటీలంతా హాజరు కానున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందరికీ చేరినట్లు తెలుస్తోంది. మరి రిసెప్షన్ స్పెషల్ గా ఎలాంటి వంటకాలు ఏర్పాట్లు చేస్తున్నారు? అన్నది తెలియాలి.