Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ బ్యాక్ టూ 'మ‌ట్కా'!

అలాగే ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న 'మ‌ట్కా' కూడా షూటింగ్ అంతా కూడా సెట్స్ లోనే జ‌ర‌గ‌డంతో సెట్ల నిర్మాణ విష‌యంలోనూ కొంత జాప్యం జ‌రిగింది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 7:17 AM GMT
మెగా ప్రిన్స్ బ్యాక్ టూ మ‌ట్కా!
X

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కొన్ని రోజులుగా రెస్ట్ మోడ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఏపీ లో ఎన్నిక‌లు జ‌ర‌గ డంతో బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌రుపున ప్ర‌చారంలో చురుకుగా పాల్గొన్నాడు. బాబాయ్ గెలుపుకోసం త‌ల్లితో క‌లిసి ప్ర‌చారం చేసాడు. ప్ర‌స్తుతం వ‌రుణ్ స‌హా ఫ్యామిలీ అంతా విజ‌యానందంలో ఉంది. దీంతో షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చాడు. అలాగే ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న 'మ‌ట్కా' కూడా షూటింగ్ అంతా కూడా సెట్స్ లోనే జ‌ర‌గ‌డంతో సెట్ల నిర్మాణ విష‌యంలోనూ కొంత జాప్యం జ‌రిగింది.

1960-80 బ్యాక్ డ్రాప్ స్టోరీ కావ‌డంతో పాత‌కాలం సెట్లు కోసం ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ చేసి ప‌నిచేస్తోంది టీమ్. అలా ఇంత‌వ‌ర‌కూ కొంత భాగం షూటింగ్ ముగించారు. అయితే తాజాగా కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోంది టీమ్. ఇందులో వ‌రుణ్ తేజ్ కూడా పాల్గొంటాడ‌ని తెలుస్తోంది. దానికి సంబంధించి అధికారిక స‌మ‌చారం కూడా ఇచ్చేసారు. వ‌రుణ్ బ్యాక్ టూ సెట్స్ అంటూ లీక్ ఇచ్చేసారు. హైద‌రాబాద్ లో వేసిన భారీ సెట్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

వ‌రుణ్ స‌హా కీల‌క న‌టులంతా పాల్గొంటార‌ని తెలుస్తోంది. అయితే వ‌రుణ్ ఎంట్రీ ఈసారి రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. వ‌రుణ్ రెట్రో మ్యూజిక్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. దానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు. ఇదిగో ఇక్క‌డ ఓ పాత టెలిఫోన్ చేత‌ప‌ట్టుక‌ని, తెలుపు దుస్తులు ధ‌రించి నుంచుని ఉన్న పిక్ చూడొచ్చు. వ‌రుణ్ బ్యాక్ టూ సెట్స్ అన్న దాన్ని ఆ విధంగా హైలైట్ చేసారు.

ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ ఏకంగా 4 విభిన్న‌మైన గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నాడు. వాటి ఆహార్యం చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. అప్ప‌టి మ‌నుషులు ఎలా ఉండేవారు? ఎంత మాసివ్ గా ఉండేవారు? అన్న‌ది సినిమాలో హైలైట్ చేస్తున్నారు. స్టోరీ డిమాండ్ మేర‌కు వ‌రుణ్ పాత్ర‌ని ఆ ర‌కంగా డిజైన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ లో వ‌రుణ్ తేజ్ ర‌గ్గ‌డ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.