వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం
మెగా బ్రదర్ నాగబాబు జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు
By: Tupaki Desk | 28 Feb 2024 11:28 AM GMTమెగా బ్రదర్ నాగబాబు జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. హిట్ చిత్రాలతో పాటు ప్లాప్ చిత్రాలు చేసి నష్టాలు చూసారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ కొనసాగు తున్నారు. అయితే నటుడిగా నాగబాబు ..చిరంజీవి అనుకున్న స్థానానికి చేరుకోలేదు అన్న అసంతృప్తి చిరులో కనిపించేది. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ క్లిక్ అయ్యాడు గానీ..నాగబాబు పెద్ద స్టార్ కాకపోవడంతో చిరు రెండవ తమ్ముడి విషయంలో కాస్త ఫీలయ్యేవారు.
అయితే తండ్రి కాకపోయినా వరుణ్ తేజ్ మాత్రం ఇప్పుడు పెద్ద హీరో అవ్వడంతో చిరులో ఆ బెంగ ఇప్పుడు ఎక్కడా లేదు. మీ నాన్న కోరికను..ఆశని నువ్వు నెరవేర్చావ్ అంటూ చాలా సందర్భాల్లో అన్నారు. వరుణ్ హైట్ విషయంలో హీరోగా ఫిట్ అవుతాడా? లేదా? అన్న సందేహం కూడా చిరులో ఉండేది. కానీ డాన్సులు బాగా చేయడంతో అక్కడా వరుణ్ తేజ్ పాస్ అయ్యాడు. ఇప్పుడు వరుణ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. నాగబాబు ఇక సినిమాలు చేసినా..చేయికపోయినా పర్వాలేదు? అనే ధీమా కనిపిస్తుంది.
నటుడిగా వరుణ్ గ్రాఫ్ అంతకంకు పెరుగుతుంది. కమర్శియల్ చిత్రాలతో పాటు ప్రయోగాలు చేసి నతకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. అయితే తాజాగా వరుణ్ తేజ్ తన మనసులో ఉన్న ఓ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు.' ప్రతీ సినిమా డబ్బు కోసం చేయకూడదు. అంతరిక్షం సినిమాకి ముందు ప్రతీ సినిమాకి వంద శాతం పారితోషికం తీసుకున్నాను.
కానీ'అంతరిక్షం' చిత్రానికి 50శాతమే తీసుకున్నాను. మిగతా డబ్బు సినిమా కోసం ఖర్చు చేయమని చెప్పాను. ఇంత తీసుకోమని నాకు నిర్మాతగానీ..దర్శకుడు కానీ చెప్పలేదు. ఆ సినిమాకి అంతే తీసుకోవాలి అని నాకు నేనుగా అనుకున్నాను. కొన్ని సినిమాలు అలా ప్రభావితం చేస్తుంటాయి. వాణిజ్య పరంగా సినిమాకి గట్టి దెబ్బ తగిలితే పారితోషికం తగ్గించుకోవడమో..పూర్తిగా తీసుకోకుండా ఉండటమో చేస్తాను. ఆ సందర్భం వచ్చినా తట్టుకునే శక్తి నా దగ్గర ఉంది. నటుడిగా నాపై నాకున్న నమ్మకం అది' అన్నాడు. మొత్తానికి ఓ నిర్మాత కొడకు నిర్మాత కోణంలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు.