Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ వాలెంటైన్-మ‌ట్కా మ‌ధ్య‌లో వ‌రుణ్ ప్లాన్ ఇది!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చేతిలో రెండు సినిమాలు రెడీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 'ఆప‌రేష‌న్ వాలెంటైన్' 'ఒక‌టి కాగా...మ‌ట్కా అనే చిత్రం రెండ‌వ‌ది

By:  Tupaki Desk   |   19 Aug 2023 6:34 AM GMT
ఆప‌రేష‌న్ వాలెంటైన్-మ‌ట్కా మ‌ధ్య‌లో వ‌రుణ్ ప్లాన్ ఇది!
X

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చేతిలో రెండు సినిమాలు రెడీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 'ఆప‌రేష‌న్ వాలెంటైన్' 'ఒక‌టి కాగా...మ‌ట్కా అనే చిత్రం రెండ‌వ‌ది. ప్ర‌స్తుతం శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆప‌రేష‌న్ వాలెంటైన్ వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో వ‌రుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. వైవిథ్య‌మైన చిత్రాల‌కు పెట్టింది పేరుగా నిలిచిన వ‌రుణ్ నుంచి రాబోతున్న మ‌రో డిఫ‌రెంట్ చిత్రం కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

డిసెంబ‌ర్ లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో భాగంగా చిత్రీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతోంది. షెడ్యూల్ కి షెడ్యూల్ కి మ‌ధ్య లో పెద్ద గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ చుట్టేస్తున్నారు. వ‌రుణ్ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం కావ‌డం విశేషం. దీంతో ఈ సినిమాని వ‌రుణ్ ఎంతో ప్ర‌త్యేకంగా భావిస్తున్నాడు. షూటింగ్ ప్రారంభానికి ముందే లుక్ ప‌రంగా బాడీలో చాలా మార్పులు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

అందుకోసం విదేశాలు వెళ్లి మ‌రీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఇదే స‌మ‌యంలో వ‌రుణ్ -లావ‌ణ్య త్రిపాఠిని నిశ్చితార్దం కూడా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ లో వివాహం జ‌రుగుతుంద‌ని మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ బ‌య‌ట‌కొచ్చింది. వ‌రుణ్ ఈ పెళ్లిని ఆప‌రేష‌న్ వాలైంటెన్-మ‌ట్కా మ‌ధ్య‌లో ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆప‌రేష‌న్ వాలెంటైన్ రిలీజ్ అయిన వెంట‌నే వ‌రుణ్ వివాహం జ‌రుగుతందిట‌. అందుకోసం కొంత గ్యాప్ తీసుకుంటాడు. పెళ్లి త‌ర్వాత హ‌నీమూన్ ..విరామం ఇలా రెండు నెల‌లు పాటు గ‌డిచిపోతుంది. అటుపై మ‌ట్కా చిత్రం షూటింగ్ వేగ‌వంతం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌ట్కా సినిమా అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. వైజాగ్ లోనే మెజార్టీ భాగం షూటింగ్ ఉంటుంది. అవ‌స‌రం మేర అక్క‌డా సెట్స్ వేసి షూటింగ్ చేస్తార‌ని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయ‌డానికి కూడా స‌మ‌యం ప‌డుతుందిట‌. ఇందులో వ‌రుణ్ నాలుగు విభిన్న గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నాడని తెలుస్తోంది.