Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ మూవీ.. AIతో హీరో ప్రేమ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jun 2024 11:30 AM GMT
వరుణ్ తేజ్ మూవీ.. AIతో హీరో ప్రేమ!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల పాన్ ఇండియా ఫిల్మ్.. ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో వచ్చినా అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయారు. దీంతో సరైన హిట్ కొట్టాలని రెండేళ్ల నుంచి చూస్తున్న ఆయన.. మట్కా మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల రీస్టార్ట్ అయింది.

మట్కా మూవీ సెట్స్ పై ఉండగానే మరో రెండు చిత్రాలను వరుణ్ లైన్ లో పెట్టారని తెలుస్తోంది. అందులో ఒక సినిమా విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో తెరకెక్కనుందని సమాచారం. మాస్ మహారాజా రవితేజతో 'టచ్ చేసి చూడు' సినిమా తీసిన ఆయన.. ఇటీవల వరుణ్ తేజ్ కు పూర్తి స్క్రిప్ట్ ను నెరేట్ చేశారట. దీంతో వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ జోనర్ లో తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే వరుణ్ తేజ్.. దాదాపు ఆరేళ్ల తర్వాత లవ్ స్టోరీ జోనర్ లో మూవీ చేయనున్నారు. తొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ ఆ తర్వాత.. గద్దలకొండ గణేష్, గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి చిత్రాలు చేశారు. కానీ హిట్ కొట్టలేకపోయారు. ఇప్పుడు మళ్లీ లవ్ స్టోరీతో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు. ఇక ఈ సినిమా కథ.. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ఉంటుందని టాక్.

అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతోందని సమాచారం. ఇప్పుడు ఈ విషయంపై ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న AI కాన్సెప్ట్ తో సినిమా అంటే.. ఆసక్తిగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. వరుణ్.. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు మరిన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవుతాయని సమాచారం. ఈ మూవీ తర్వాత మేర్లపాటి గాంధీతో వరుణ్ వర్క్ చేయనున్నారని టాక్. యూవీ క్రియేషన్స్ ఈ మూవీ రూపొందించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న మెగా హీరో.. కొత్త సినిమాలతో ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.