Begin typing your search above and press return to search.

ఎయిర్ ఫోర్స్ డేకి వాలెంటైన్ స్పెష‌ల్‌!

మెగావార‌సుడు వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ హుడా దర్శ‌క‌త్వంలో పాన్ ఇండియాలో 'ఆప‌రేష‌న్ వాలెంటైన్' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Sep 2023 6:35 AM GMT
ఎయిర్ ఫోర్స్ డేకి వాలెంటైన్ స్పెష‌ల్‌!
X

మెగావార‌సుడు వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ హుడా దర్శ‌క‌త్వంలో పాన్ ఇండియాలో `ఆప‌రేష‌న్ వాలెంటైన్` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ నుంచి రాబోతున్న మ‌రో వైవిథ్య‌మైన చిత్ర‌ద‌మి. దేశ భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఇందులో వ‌రుణ్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్ర‌లో కనిపించ‌బోతున్నాడు. ఆయ‌న‌కు జోడీగా మానుషి చిల్ల‌ర్ న‌టిస్తోంది. ఆమె రాడ‌ర్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది.

ఇక సినిమా షూటింగ్ చాలా వేగంగానే పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది. ఎక్క‌డెక్క‌డ షూట్ చేసారు? అన్న వివ‌రాలు రివీల్ చేయ‌లేదు గానీ ..అప్పుడే డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లైపోయాయి. సినిమా టె క్నిక‌ల్ గానూ హైలైట్ అవుతుంది. దీనిలో భాగంగా విజువ‌ల్ ఎపెక్స్ట్ కి ఎక్కువ స్కోప్ ఉంద‌ని తెలుస్తోంది. కొన్ని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచుతాయ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఇలా సినిమా ప‌నులు వేగంగానే జ‌రుగుతున్నా! బ‌జ్ తీసుకురావ‌డంలో మాత్రం యూనిట్ వెనుక‌బ‌డే ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కూ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఏవీ అందివ్వ‌లేదు. కొన్ని ర‌కాల పోస్ట‌ర్లు త‌ప్ప‌! హీటెక్కించే ట్రైల‌ర్ లాంటివి క‌నిపించలేదు. ఈ నేప‌థ్యంలో అక్టోబ‌ర్ 8 ఎయిర్ ఫోర్స్ డే ని వేదిక‌గా చేసుకున్న‌ట్ల్లు స‌మాచారం. ఆ రోజున ప్ర‌త్యేకంగా సినిమాకి సంబంధించిన ప్ర‌చార చిత్రాలు రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారుట‌. అదీ కొంత మంది ఎయిర్ ఫోర్స్ అధికారుల చేతుల మీదుగా వాటిని లాంచ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. మ‌రి ఆ రోజున ఎలాంటి స్పెష‌ల్ తో ముందుకొస్తారో చూద్దాం.

ఈ సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ‌త సినిమా గాండీవ‌ధారి అర్జున భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై వ‌రుణ్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఫ‌లితాలు తారుమారు చేసాయి. దీంతో ఆప‌రేష‌న వాలెంటైన్ త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది.