Begin typing your search above and press return to search.

వచ్చే నెలలో కనిపించని మెగా 'వాలెంటైన్‌'

మెగా ఫ్యామిలీ లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ సుదీర్ఘ కాలంగా ప్రేమిస్తున్న లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు

By:  Tupaki Desk   |   20 Oct 2023 2:30 PM GMT
వచ్చే నెలలో కనిపించని మెగా వాలెంటైన్‌
X

మెగా ఫ్యామిలీ లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ సుదీర్ఘ కాలంగా ప్రేమిస్తున్న లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఇప్పటికే వివాహ నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగింది. ఇక పెళ్లి వేడుకకు సంబంధించిన సందడి షురూ అయింది. ఇటీవలే మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ తేజ్ ఇచ్చిన పార్టీ లో పాల్గొన్నారు.

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఆపరేషన్‌ వాలెంటైన్‌ షూటింగ్‌ పూర్తి అయింది. తన వంతు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ని కూడా వరుణ్‌ తేజ్‌ ముగించాడు అంటూ సమాచారం అందుతోంది. ఈ సినిమా ని డిసెంబర్‌ 8న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా యూనిట్‌ సభ్యుల నుంచి ప్రకటన వచ్చింది.

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసిన వరుణ్ తేజ్ పెళ్లి పనులతో బిజీ అయ్యాయి. వచ్చే నెల మొత్తం పెళ్లి పనులతో బిజీగా ఉంటాడు.. కనుక ఆపరేషన్‌ వాలెంటైన్ సినిమా గురించి వరుణ్ తేజ్ పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఒక హీరోగా కాకుండా నార్మల్ వ్యక్తిగానే వరుణ్‌ తేజ్ పెళ్లి పనులతో బిజీగా ఉంటాడని సమాచారం అందుతోంది.

యూరప్‌ లో పెళ్లి ఆ తర్వాత కార్యక్రమాలను ముగించుకుని మెల్లగా నవంబర్ చివరి వారం లో లేదా డిసెంబర్‌ ఒకటి లేదా రెండో తారీకున వరుణ్‌ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలు ఇండియాలో ల్యాండ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది. ఇండియా లో ల్యాండ్‌ అయిన వెంటనే ఆపరేషన్‌ వాలెంటైన్ సినిమా ప్రమోషన్‌ కి వరుణ్ రెడీ అవుతాడు అంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.