Begin typing your search above and press return to search.

న‌వ‌దంప‌తుల‌తో మెగాబ్యాచ్ మామూలుగా లేదే!

వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠిలు వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. మేళ తాళాల‌తో ఇట‌లీని మారుమ్రో గించారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 6:31 AM GMT
న‌వ‌దంప‌తుల‌తో మెగాబ్యాచ్ మామూలుగా లేదే!
X

వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠిలు వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. మేళ తాళాల‌తో ఇట‌లీని మారుమ్రో గించారు. తెలుగింట పెళ్లి అంటే ఎలా ఉంటుందో? ఇట‌లీ జ‌నాల‌కి ప‌రిచ‌యం చేసారు. ఇక వివాహం అనంత‌రం పెళ్లికొచ్చిన వారంతా కొత్త దంప‌తుల‌తో క‌లిసి ఫోటో సెష‌న్ లో పాల్గొన్నారు. ఫ్యామిలీతో వ‌చ్చిన వారంతా కుటుంబ స‌మేతంగా...స్నేహితులంతా ప్రెండ్స్ గ్యాంగ్స్ గా దంపతుల‌తో ఫోటోలు దిగారు.

మ‌రి మెగా బ్యాచ్ ఎలా ప్లాన్ చేసిందంటే? ఈ ఫోటో చూస్తే తెలిసిపోతుంది. మెగా బ్యాచ్ అంతా ఒకే స్నాప్ లో వావ్ అనిపించిన పిక్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెగాస్టార్ అన్న‌ద‌మ్ములు...వార‌సులంతా క‌లిసి ఓ ఫోటో దిగారు .అంతా వైట్ అండ్ వైట్ లో క‌నిపిస్తున్నారు. చిరంజీవి ..నాగ‌బాబులు క్రీమ్ క‌ల‌ర్ ప‌ట్టు వ‌స్త్రాలు ధ‌రించారు. మెడ‌లో కండువా వేసి పెళ్లి పెద్ద‌రికాన్ని త‌మ‌దైన శైలిలో హైలైట్ చేసారు.

మ‌రో త‌మ్మ‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం టీష‌ర్ట్..ప్యాంట్ లో క‌నిపిస్తున్నారు. సాధార‌ణంగా ఆయ‌న బ‌య‌ట‌ ఎక్కువ‌గా తెలుపు దుస్తుల్లో క‌నిపిస్తారు. కానీ పెళ్లిలో మాత్రం తెలుపు వ‌స్త్రాల‌కు దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. చిరంజీవి ప‌క్క‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచున్నారు. ఆ ప‌క్క‌నే రామ్ చ‌ర‌ణ్ ఉన్నాడు. చ‌ర‌ణ్ రెడీ మేడ్ ష‌ర్ట్ ప్యాంట్ ధ‌రించాడు. అత‌ని కుడివైపున వైష్ణ‌వ్ తేజ్ ఉన్నాడు. అత‌ను కుర్తా దుస్త‌లు ధ‌రించాడు.

చిరుకి ఎడ‌మ‌వైపున అల్లు అర్జున్ వైంట్ వైట్ లో క‌నిపిస్తున్నాడు. ఆపక్క‌నే మేనల్లుడు సాయితేజ్ క‌ళ్ల‌ద్దాలు పెట్టి మ‌రీ ఫోజులిచ్చాడు. అత‌ని ప‌క్క‌నే అల్లు శిరీష్ నుంచున్నాడు. శిరీష్ కూడా కుర్తాలోనే ఉన్నాడు. వ‌రుస చివ‌ర్లో నాగ‌బాబు ఉన్నారు. ఇలా మెగా ఫ్యామిలీ అంతా గేద‌ర్ అవ్వ‌డం అభిమానుల‌కు క‌న్నుల విందుగా ఉంది. సాధార‌ణంగా సినిమా వేడుక‌ల‌పై క‌నిపిస్తుంటారు. అక్క‌డంతా జీన్స్ ప్యాంట్ లు..టీష‌ర్టులు వేసుకుంటారు. కాబ‌ట్టి కొత్త‌గా అనిపించ‌దు. ఆ త‌ర్వాత కుటుంబంలో ఏదైన వేడుక జ‌రిగితే త‌ప్ప ఇలాంటి క‌న్ను విందైన దుస్తుల్లో క‌నిపించ‌రు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప‌ట్టు వ‌స్త్రాలు ధ‌రిస్తే ప్రేమ్ ఇంకా బాగుండేది.