ఈ నటితో పని చేశాక నెక్ట్స్ చాలా కష్టం
సెట్లో పని చేసేప్పుడు ఆర్టిస్టులతో దర్శకులకు ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. తన నటీనటులతో అనుబంధం కలిగి ఉండటం కూడా ఆ సినిమాకి కలిసొస్తుంది
By: Tupaki Desk | 28 Dec 2024 7:30 PM GMTసెట్లో పని చేసేప్పుడు ఆర్టిస్టులతో దర్శకులకు ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. తన నటీనటులతో అనుబంధం కలిగి ఉండటం కూడా ఆ సినిమాకి కలిసొస్తుంది. ఏడాది పైగా సమయం కేటాయించి ఒక సినిమా కోసం పని చేసాక .. తనతో పని చేసిన నటీమణి ఎలా ఉంటుందో ఏ దర్శకుడు అయినా సులువుగా చెప్పగలరు.
2024లో జిగ్రా చిత్రం కోసం ఆలియాతో కలిసి పని చేసాడు వాసన్ బాలా. అతడు తెరకెక్కించిన జిగ్రా ఫ్లాపైనా కానీ, ఆలియాతో అతడు గొప్ప అనుబంధం కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలియాతో పని చేసాక.. ఆ తర్వాతి సినిమాకి ఎవరితో పని చేయాలన్నా అది కష్టంగానే ఉంటుందని అతడు అన్నాడు.
ఆలియాను డైరెక్ట్ చేయడం చాలా సులువు. సెట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కొన్ని సార్లు నేను సన్నివేశాన్ని ఎలా రావాలని కోరుకుంటున్నానో వివరించాల్సిన అవసరం కూడా లేదు. ఆ షాట్‌లో నాకు ఏమి అవసరమో అర్థం చేసుకోవడానికి ఒక సిగ్నల్ ఇస్తే చాలు.. సులువుగా అర్థం చేసుకుని నటించేస్తుంది`` అని అన్నారు. నిజానికి షూటింగ్ సమయంలో సెట్లో ఫన్ ఉంటుంది. కానీ నా చిత్రంలో హాస్యం లేదు. సెట్లో వాతావరణం చాలా సీరియస్‌గా ఉండేది. కానీ ఒక రోజు సరదాగా కుదిరింది. రోజంతా ఆడుతూ పాడుతూ జాలీగా గడిపాం.. మాట్లాడుకున్నాం.. నవ్వుకున్నాం`` అని తెలిపాడు.
నేను ఇష్టపడే ప్రతి దర్శకుడికి అలియా భట్‌తో కలిసి పనిచేసే అవకాశం రావాలని నేను భావిస్తున్నాను. అయితే ఒకసారి ఆలియాతో కలిసి పని చేసాక... వారి తదుపరి చిత్రం సెట్స్ లో బాధపడతారు...ఆలియాతో కలిసి పని చేయడం అంత సులువుగా ఉంటుందని కితాబిచ్చారు.
ఆలియా నటించిన యాక్షన్ థ్రిల్లర్ జిగ్రా విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. 2024లో బాలీవుడ్ లో పెద్ద ఫ్లాప్ లలో ఇది ఒకటి. ఈ చిత్రంలో ఆలియా, వేదంగ్ రైనా కీలక పాత్రలు పోషించారు. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 50 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేయగలిగింది.