Begin typing your search above and press return to search.

సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో డైరెక్ట‌ర్ ఏం చేసాడంటే?

భారీ హోప్స్ న‌డుమ విడుద‌లైన ఆలియా చిత్రం `జిగ్రా` బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫెయిలైంది.

By:  Tupaki Desk   |   20 Oct 2024 11:30 PM GMT
సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో డైరెక్ట‌ర్ ఏం చేసాడంటే?
X

భారీ హోప్స్ న‌డుమ విడుద‌లైన ఆలియా చిత్రం `జిగ్రా` బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫెయిలైంది. ఈ సినిమా 80 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌గా, కేవ‌లం 40 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. దీంతో స‌గానికి స‌గం న‌ష్టాలు ఎదుర‌య్యాయి. శాటిలైట్, డిజిట‌ల్ హ‌క్కుల రూపంలో నిర్మాత సేవ్ అయినా కానీ, పంపిణీదారులు, బ‌య్యర్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. దీంతో నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కి ద‌ర్శ‌కుడు వాసన్ బాల‌న్ కి మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.

ఇంత‌కుముందే వాస‌న్ బాలా మీడియా ముందుకు వ‌చ్చి, జిగ్రా ప‌రాజ‌యానికి తాను బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. నిర్మాత‌ల స‌హ‌కారం ఏదీ లేన‌ప్ప‌టికీ బాధ్య‌త అంతా నాదేన‌ని ఆయ‌న అన్నారు. ఇప్పుడు

జిగ్రా బాక్స్ ఆఫీస్ వైఫల్యంతో ఆన్ లైన్‌ ద్వేషాన్ని ఎదుర్కొంటున్నాడు వాస‌న్ బాలా. దీంతో ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను డీయాక్టివేట్ చేశాడు. ఒకరోజు ముందు వరకు యాక్టివ్‌గా ఉన్న వాసన్‌బాలా ట్విట్టర్ ఖాతా ఆదివారం డిలీట్ అయింది. అతడి మునుపటి ట్వీట్‌లకు సమాధానాలన్నీ ఖాళీ స్లాట్‌లుగా క‌నిపిస్తున్నాయి. ఈ పోస్ట్ ఉనికిలో లేని ఖాతా నుండి వచ్చింది.. అని రాసి ఉంది. అలాగే ఎక్స్ ఖాతా ల్యాండింగ్ పేజీ కూడా ఇప్పుడు ఖాళీగా ఉంది.

జిగ్రాను సమర్థిస్తూ మాట్లాడినందుకు వాస‌న్ బాలా ఆన్ లైన్ ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ తర్వాత అత‌డు ఎక్స్ ఖాతాను తొల‌గించాడ‌ని ట్విట్టర్ వినియోగదారులు ఊహించారు. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాసన్ త‌న‌ చిత్రాన్ని సమర్థించారు. దానిని X ఖాతాలో షేర్ చేసారు. అయితే ఆ ట్వీట్‌కు ప్ర‌తిస్పంద‌న‌గా `వైఫ‌ల్యాన్ని అంగీక‌రించ‌ని అహంకారి` అని నెటిజ‌నులు గేలి చేసారు.

సినిమా పరాజయానికి ఒక్కడే కారణం కాదని పలువురు ఆయనను సమర్థించ‌గా, వారు దీనిని అలియా భట్ అకా లేడీ బచ్చన్ చిత్రంగా ప్రచారం చేసారు, కానీ దాని వైఫల్యానికి అతను మాత్రమే బాధ్యత వహించాలని కోరుకున్నారు! అంటూ కొంతమంది కరణ్ జోహార్‌ను ప్రశ్నించారు. సినిమా ప్రచారం జరుగుతున్నప్పుడు, తారలు - అలియా భట్, వేదంగ్ రైనా - నిర్మాత కరణ్‌తో పాటు ముందు వ‌రుస‌లో ఉన్నారని చెప్పారు. కానీ ఆ సినిమా అండర్ పెర్ఫార్మెన్స్ తర్వాత వాసన్ మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చాడని కొంద‌రు ఎత్తి చూపారు.

జిగ్రా క‌థాంశం ఆస‌క్తిక‌రం. విదేశీ జైలులో చిక్కుకున్న త‌న సోద‌రుడిని కాపాడుకునే ఒక సోదరి కథతో జిగ్రా రూపొందింది. గత వారాంతంలో విడుదలైన తర్వాత సానుకూల సమీక్షలను అందుకుంది. అయితే బాక్సాఫీస్ పరంగా అంచనాలకు తగ్గట్టుగా ఆడ‌లేదు. బ‌డ్జెట్ లో స‌గం మాత్ర‌మే రాబ‌ట్టింది.