Begin typing your search above and press return to search.

అలాంటి మూర్ఖులకు సమాధానం ఇదే..!

దసరా కానుకగా అలియా భట్ ప్రధాన పాత్రలో వాసన్ బాల డైరెక్షన్ లో తెరకెక్కిన జిగ్రా సినిమా రిలీజైంది.

By:  Tupaki Desk   |   15 Oct 2024 7:40 AM GMT
అలాంటి మూర్ఖులకు సమాధానం ఇదే..!
X

దసరా కానుకగా అలియా భట్ ప్రధాన పాత్రలో వాసన్ బాల డైరెక్షన్ లో తెరకెక్కిన జిగ్రా సినిమా రిలీజైంది. ఐతే సినిమా అనుకున్న రేంజ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. టాక్ బాగా లేకపోయినా సరే సినిమా కలెక్షన్స్ బాగున్నాయని మేకర్స్ పోస్టర్స్ వేస్తున్నారు. జిగ్రా సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో అలియా భట్ కూడా భాగస్వామ్యం అయ్యింది. జిగ్రా సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అలియా భట్ స్వయంగా వచ్చి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నది.

జిగ్రా తెలుగు ఈవెంట్ లో త్రివిక్రం, సమంత చీఫ్ గెస్ట్ లుగా వచ్చి సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. జిగ్రా కథ ఏంటి అంటే ఆపదలో ఉన్న తమ్ముడిని సోదరి ఎలా కాపాడింది అన్న నేపథ్యంతో జిగ్రా వచ్చింది. ఐతే ఈ సినిమా కలెక్షన్స్ పై నిర్మాతలు ఫేక్ రిపోర్ట్స్ ఇస్తున్నారంటూ బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా కామెంట్స్ చేసింది. ఆమె కామెంట్స్ బాలీవుడ్ లో హా**ట్ టాపిక్ గా మారాయి. ఐతే దీనికి నిర్మాత కరణ్ జోహార్ ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. మూర్ఖులకు మౌనమే మనం ఇచ్చే అత్యుత్తమ సమాధానం అని ఇన్ స్టా స్టోరీస్ లో పెట్టారు.

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా డైరెక్టర్ వాసన్ బాల కరణ్ స్క్రిప్ట్ సరిగా చూడకుండానే ఓకే చేశారన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను రఫ్ గా రాసుకున్న స్క్రిప్ట్ నే కరణ్ కి పంపిస్తే దాన్ని చదవకుండానే ఆయన అలియాకు పంపించారు. ఆ తర్వాత తాను స్క్రిప్ట్ లో మార్పులు ఉన్నాయని చెప్పగా అప్పటికే అలియాకు దాన్ని పంపించానని అన్నారట కరణ్. ఆ తర్వాత కరణ్ స్క్రిప్ట్ పై తన అసంతృప్తిని వ్యక్తపరిచారని వాసన్ బాల అన్నారు. ఐతే రెండు రోజుల్లో పూర్తి స్క్రిప్ట్ చేసి కలుద్దామని చెప్పానని అన్నారు.

ఐతే సగం స్క్రిప్ట్ చదివాక అలియా సినిమా చేస్తానని చెప్పిందని వాసన్ బాల చెప్పారు. ఐతే డైరెక్టర్ వాసన్ బాల తన గురించి చేసిన కామెంట్స్ పై కరణ్ జోహార్ తాను చదవకుండా ఎలా అలియాకు పంపుతానని అన్నారు. ఈ కామెంట్స్ తనకు చిరాకు కలిగించానని ఆయన అన్నారు. డైరెక్టర్ ఇంటర్వ్యూ మొత్తం వింటే అసలు విషయం అర్ధం అవుతుందని నెటిజన్లకు క్లారిటీ ఇచ్చారు కరణ్ జోహార్.