Begin typing your search above and press return to search.

విశ్వంభర రిలీజ్ డేట్.. దర్శకుడు ఏమన్నారంటే..

దసరా పండుగ సందర్భంగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా, ఈ సందర్భంగా వశిష్ట పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 4:42 PM GMT
విశ్వంభర రిలీజ్ డేట్.. దర్శకుడు ఏమన్నారంటే..
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన 'విశ్వంభర' మూవీ రిలీజ్ డేట్ మార్పుపై అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి దర్శకుడు మల్లిడి వశిష్ట క్లారిటీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా పండుగ సందర్భంగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా, ఈ సందర్భంగా వశిష్ట పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

జనవరి 10న విడుదల కావాల్సిన 'విశ్వంభర' సినిమా యొక్క రిలీజ్ డేట్ మార్పుపై రిపోర్టర్లు వశిష్టను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా వశిష్ట మాట్లాడుతూ, "విశ్వంభర చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మొదట్లో ప్లాన్ చేశాం. కానీ అదే సమయంలో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' కూడా సంక్రాంతికి విడుదల అవుతుండటంతో, రెండు పెద్ద చిత్రాలు ఒకే సమయంలో పోటీకి దిగకూడదన్న ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు 'విశ్వంభర' విడుదల తేదీని మార్చాలని నిర్ణయించారు" అని తెలిపారు.

ఇక ఇంకొక రిపోర్టర్ వశిష్టను సూటిగా ప్రశ్నిస్తూ, "రామ్ చరణ్ చిరంజీవి కొడుకైనందుకే డేట్ మార్పు చేశారా? అదే వేరే హీరో సినిమా అయితే రిలీజ్ డేట్ మార్చేవారా?" అని అడిగారు. దీనికి సమాధానంగా వశిష్ట చాలా సరళంగా, "ఎవరి సినిమా అయినా సరే, రిలీజ్ డేట్ విషయంలో తుది నిర్ణయం చిరంజీవిగారిదే ఉంటుంది. అది రామ్ చరణ్ సినిమా అయినా, వేరే హీరో సినిమా అయినా, మాకు సాంకేతిక పరంగా, మార్కెట్ పరంగా క్లాష్ రాకుండా చూసుకోవడం అవసరం" అని స్పష్టం చేశారు.

వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం 'విశ్వంభర' కోసం మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఒక ఫాంటసీ అడ్వెంచర్ గా తెరకెక్కుతుండగా, చిరంజీవి సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సినిమా షూటింగ్ పూర్తి అవ్వగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ మార్పు గురించి క్లారిటీ వచ్చినప్పటికీ, కొత్త డేట్ ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ చిత్రానికి అవకాశం కల్పించేందుకు చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్త అభిమానులకు ఆనందాన్ని కలిగించేది. అందుకే, విడుదల తేదీ మార్పుపై ఎటువంటి అనుమానాలు లేకుండా సినిమా ప్రమోషన్‌లకు కూడా పెద్దగా ఇబ్బందులు ఉండకూడదని చిత్ర బృందం భావిస్తోంది. ఇక సమ్మర్ లోనే విశ్వంభర రిలీజ్ కావచ్చని సమాచారం.