Begin typing your search above and press return to search.

#VD 12 టీజ‌ర్ అత‌డి చేతుల్లోనా?

అనిరుద్ టీజ‌ర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్న‌టైమ్ లో అందించగ‌ల్గితే సంక్రాంతి కి రిలీజ్ అయ్యే సినిమాల‌కు టీజ‌ర్ ఎటాచ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 5:53 AM GMT
#VD 12 టీజ‌ర్ అత‌డి చేతుల్లోనా?
X

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో వీడీ12వ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన విజ‌య్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ ని స‌రికొత్త కోణంలో తిన్న‌నూరి ఆవిష్క‌రిస్తున్నాడు. జెర్సీ త‌ర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత చేస్తోన్న చిత్ర‌మిది.ఇంకా ఈ సినిమాకి టైటిల్ ప్ర‌క‌టించ‌లేదు. టైటిల్ పై సైతం ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌వ‌రకూ ఏ టైటిల్ కూడా తెర‌పైకి రాలేదు.

ఓ ర‌కంగా చెప్పాలంటే? సినిమా సెట్స్ లో ఉన్న అప్ డేట్స్ ఏవీ పెద్ద‌గా రివీల్ చేయ‌డం లేదు. దీంతో స్టేట‌స్ కోసం విజ‌య్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. కానీ ఆ ఛాన్స్ రావాలంటే? యువ మ్యూజిక్ సంచ‌ల‌నం అనిరుద్ ఛాన్స్ ఇవ్వాలి. అవును ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. టీజ‌ర్ రెడీ అవ్వాలంటే అత‌డు పూనుకుంటే త‌ప్ప ప‌న‌వ్వ‌దు. అందుకే ఇలా హింట్ ఇచ్చారు.

అనిరుద్ టీజ‌ర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్న‌టైమ్ లో అందించగ‌ల్గితే సంక్రాంతి కి రిలీజ్ అయ్యే సినిమాల‌కు టీజ‌ర్ ఎటాచ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఐడియా బాగానే ఉంది. కానీ ఇది సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్న‌ది పూర్తిగా అనిరుద్ చేతుల్లోనే ఉంది. అందుకే మేక‌ర్స్ ఇలా లాక్ చేసారు. ప్ర‌స్తుతం అనిరుద్ వ‌రుస సినిమాలో బిజీగా ఉన్నారు. డేలో 20 గంట‌లు ఆన్ సెట్స్ లో ఉన్న సినిమాల కోస‌మే ప‌నిచేస్తున్నారు.

అవిగాక కొత్త క‌మిట్ మెంట్టు ఉన్నాయి. వీట‌న్నింటి న‌డుమ అనిరుద్ వీడీ 12 టీజ‌ర్ కోసం కంపోజ్ చేయాలి. మ‌రి ఈ అభ్య‌ర్ధ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రంగంలోకి దిగుతాడా? అన్న‌ది చూడాలి. సంక్రాంతి కానుక‌గా 'గేమ్ ఛేంజ‌ర్', 'డాకు మ‌హారాజ్', 'సంక్రాంతికి వ‌స్తున్నాం' లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి రిలీజ్ ల‌కు టీజ‌ర్ ఎటాచ్ చేస్తే కోట్ల రూపాయ‌ల ప‌బ్లిసిటీ ద‌క్కిన‌ట్లే.