VD ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్..!
సినిమా గురించి ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నా కూడా మేకర్స్ మాత్రం సినిమా అప్డేట్స్ ని ఇవ్వట్లేదు. ఈ విషయంలో వీడీ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు.
By: Tupaki Desk | 16 Dec 2024 8:30 AM GMTరౌడీ బోయ్ ఇమేజ్ తో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ ఇయర్ ఫ్యామిలీ స్టార్ అంటూ ఒక సినిమాతో రాగా అది కాస్త నిరాశ పరిచింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పోలీస్ రోల్ లో కనిపించనున్నారు.
ఆమధ్య సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అవ్వగా విజయ్ దేవరకొండ స్మాల్ హెయిర్ కట్ తో డిఫరెంట్ గా కనిపించాడు. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ లాక్ చేశారు. 2025 సినిమాల రిలీజ్ షెడ్యూల్ లో అన్ని పోటీ పడుతున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
సినిమా గురించి ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నా కూడా మేకర్స్ మాత్రం సినిమా అప్డేట్స్ ని ఇవ్వట్లేదు. ఈ విషయంలో వీడీ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమా ష్యూర్ షాట్ హిట్ టార్గెట్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో విజయ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. ఐతే సినిమా మొదలై ఇన్నాళ్లు అవుతున్నా సినిమా నుంచి అఫీషియల్ గా ఒక పోస్టర్ కూడా వదల్లేదు. మేకర్స్ చేస్తున్న ఈ జాప్యం పై విజయ్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ గా ఉన్నా కూడా త్వరలో వారికి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ సినిమా నుంచి క్రిస్ మస్ లేదా న్యూ ఇయర్ కానుకగా టీజర్ వస్తుందని టాక్. టీజర్ తోనే సినిమాపై బజ్ పెంచాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ రవికిరణ్ తో ఒక సినిమా.. రాహుల్ సంకృత్యన్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలతో విజయ్ దేవరకొండ కూడా తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. రౌడీ ఫ్యాన్స్ అందరికీ మాస్ ట్రీట్ ఇచ్చేలా వరుస క్రేజీ సినిమాలను లైన్ లో పెట్టాడు విజయ్ దేవరకొండ. మరి రాబోతున్న సినిమాలతో విజయ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.