వీడీ12 టైటిల్ అదేనా?
అయితే ఇప్పుడు వీడీ12 టైటిల్ టీజర్‌ను రివీల్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 Feb 2025 11:29 AM GMTరౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ సాఫీగా సాగడం లేదు. ఏ సినిమా చేసినా భారీ హైప్ తో వచ్చి డిజాస్టర్లవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ట్యాక్సీ వాలా సినిమా తర్వాత విజయ్ సాలిడ్ హిట్ అందుకున్నది లేదు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలన్నీ ఫ్లాపులుగానే మిగిలాయి. దీంతో ఇప్పుడు విజయ్ కు అర్జెంటుగా ఓ హిట్ అవసరం.
ఈ నేపథ్యంలోనే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ కెరీర్లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. ఈ కాంబినేషన్ పై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. మధ్యలో ఫ్యామిలీ స్టార్ సినిమా కారణంగా ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి విజయ్ ముందు ఆ సినిమాను పూర్తి చేశాడు. లేకపోతే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ పాటికే వీడీ12 రిలీజ్ కూడా అయుండేది. షూటింగ్ మొదలై ఇంత కాలమవుతున్నా ఈ సినిమా టైటిల్ ను ఇప్పటివరకు మేకర్స్ రివీల్ చేయలేదు.
అయితే ఇప్పుడు వీడీ12 టైటిల్ టీజర్‌ను రివీల్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ దానికి సంబంధించిన వర్క్ పూర్తైందని, ఇన్ని రోజులు అనిరుధ్ బీజీఎం వల్లే లేటైందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు 'సామ్రాజ్యం' అనే టైటిల్‌ను లాక్ చేసినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. అందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, తనకు ట్యాక్సీవాలా సినిమాతో మంచి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్య్సన్ తో సినిమాను చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఆ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ మొదలైంది.