'VD12'.. శ్రీలీల ట్విస్టుతో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు?
ఆమె స్థానంలో యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి తో పాటూ 'సప్త సాగరాలు దాటి' హీరోయిన్ రుక్మిణి వసంత్ లను మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 20 Jan 2024 6:30 AM GMTరౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది 'ఖుషి' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆడియన్స్ నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకొని బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ విజయ్ దేవరకొండకి కావలసిన భారీ కం బ్యాక్ ని ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని ప్లాన్ చేశారు. #VD12 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నారు. అదే సమయంలో శ్రీలీలా వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు కోసం డేట్స్ కేటాయించలేకపోయింది. దాంతో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లకుండా వాయిదా పడుతూ వచ్చింది.
దాంతో విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని, తన ప్లేస్లో రష్మిక మందనని తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి నిజంగానే శ్రీలీలా తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి తో పాటూ 'సప్త సాగరాలు దాటి' హీరోయిన్ రుక్మిణి వసంత్ లను మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరు హీరోయిన్లు ఒకే ఒక్క సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. వీరిలో ఒకరు విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టులో నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మార్చి నుంచి ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు.
ఓ సాధారణ కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్ గా ఎదిగిన హీరో కథనే గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాలో చూపించబోతున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బాండర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.