Begin typing your search above and press return to search.

దేవరకొండ - రామ్.. ఆ డబ్బు వెనక్కి రావాల్సిందే..

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాల ద్వారా ఈ హీరోలకు సక్సెస్ రావాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే సినిమాలపై కూడా కొంత నిర్మాతలు భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   19 Aug 2023 10:09 AM GMT
దేవరకొండ - రామ్.. ఆ డబ్బు వెనక్కి రావాల్సిందే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రామ్ పోతినేని ఇద్దరు కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలే. అయితే గత ఏడాది మాత్రం ఈ హీరోలిద్దరికి కూడా మర్చిపోలేని డిజాస్టర్స్ అయితే ఎదురయ్యాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఏ స్థాయిలో ఫ్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలి అని విజయ్ దేవరకొండ గట్టిగానే హార్డ్ వర్క్ చేసాడు.

కానీ ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాదాపు 60 కోట్ల రేంజ్ లోనే థియేటర్లలో నష్టాలను మిగిల్చింది. అయితే మరోవైపు రామ్ పోతినేని, ది వారియర్ సినిమాతో కూడా ఊహించిన విధంగా డిజాస్టర్ అయితే ఎదుర్కొన్నాడు. లింగస్వామి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా దాదాపు 17 కోట్ల స్థాయిలో అయితే నష్టాలను కలుగజేసింది.

అందుకే ఈసారి ఎలాగైనా బోయపాటి స్కంద సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని రామ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ లవ్ స్టోరీ గా తెరపైకి రాబోతున్న ఖుషి సినిమాతో సక్సెస్ కొట్టాలి అని చూస్తున్నాడు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఇక ఖుషి సినిమాపై నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అయితే దాదాపు 60 కోట్ల పెట్టుబడి పెట్టింది.

మార్కెట్లో ఈ సినిమాకు దాదాపు థియేట్రికల్ గా 55 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ జరిగినట్లు టాక్ అయితే వినిపించింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఖుషి సినిమాతో ఈ టార్గెట్ ను పూర్తి చేసి విజయ్ తన మార్కెట్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు రామ్ పోతినేని కూడా మరో స్థాయికి రావాలి అంటే స్కంద సినిమాతో కూడా అతను 60 కోట్ల రేంజ్ లో అయితే షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాల ద్వారా ఈ హీరోలకు సక్సెస్ రావాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే సినిమాలపై కూడా కొంత నిర్మాతలు భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి వాటి మార్కెట్ డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఖుషి స్కంద రెండు కూడా టార్గెట్ పూర్తిచేసుకుని మరికొంత లాభాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది.