Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ వాడకం...ఇది పెద్ద ప్లానే..

ఇక విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలలో కూడా దీన్ని మరొక రేంజ్ కు తీసుకువెళుతూ ఏకంగా తన బ్రాండ్ టీ షర్ట్స్ పై కూడా డైలాగ్ ను లోగో గా మార్చేసాడు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 8:02 AM GMT
విజయ్ దేవరకొండ వాడకం...ఇది పెద్ద ప్లానే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కేవలం ఒక యాక్టర్ గా మాత్రమే కాకుండా యూత్ ఎక్కువగా రిసీవ్ చేసుకునే స్టార్ గా కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరైనా సరే సినిమా చేయడం దాన్ని ప్రమోట్ చేయడం రెగ్యులర్ ఫార్ములా తోనే కొనసాగుతోంది. కానీ విజయ్ దేవరకొండకు మిగతా వాళ్లకు చాలా తేడా ఉంది. అందుకే అతనికి యూత్లో మంచి క్రేజీ ఉంది.


స్టార్ హోదా పెరిగినా కూడా దేన్ని ఎలా వాడుకోవాలో అతనికి బాగా తెలుసు. వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు నేను పెద్దగా మీకు తెలియకపోవచ్చు అనే డైలాగ్ తోనే సగం క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక చిన్న సినిమాలతోనే మాస్ వాడకాన్ని కూడా గట్టిగా వాడుకున్నాడు. అర్జున్ రెడ్డి డైలాగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

భాషతోనే కాకుండా తన టైమింగ్ తో కూడా ఫాన్ ఫాలోవర్స్ ను పెంచుకున్నాడు. ఇక పరభాషలోకి కూడా అతని అడుగులు పడ్డాయి. అక్కడ పెద్దగా సక్సెస్ రాకపోయినా అతని ప్రయాణం మాత్రం ఆగడం లేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ట్యాగ్ లలో ఐరనే వంచాలా ఏంటి? అనే ట్యాగ్ ఎంతగా ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఈ ట్యాగ్ ఇతర ఫ్యాన్ హీరోలు కూడా పలు సీన్లతో డైలాగ్ ను మరింత వైరల్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలలో కూడా దీన్ని మరొక రేంజ్ కు తీసుకువెళుతూ ఏకంగా తన బ్రాండ్ టీ షర్ట్స్ పై కూడా డైలాగ్ ను లోగో గా మార్చేసాడు. ఒక విధంగా ఈ తరహా ట్రెండ్ అనేది సినిమాకు మేజర్ ప్లేస్ పాయింట్.

ట్రోల్స్ పెద్దగా వచ్చినా కూడా సినిమా పేరు అయితే మారుమ్రోగిపోతోంది. దానికి తోడు ఫ్యామిలీ స్టార్ సినిమా పక్క ఫ్యామిలీ ఆడియన్స్ కు అయితే నచ్చుతుంది. కానీ మాస్ ఆడియన్స్ కి కూడా నచ్చితేనే బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు బాగా పెరుగుతాయి. దానికి తోడు పోటీగా మరొక బిగ్ సినిమా గుంటూరు కారం ఉంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో కాబట్టి పోటీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో తెలియదు. కాబట్టి చిన్న సందు కూడా వదలకూడదు అని విడుదలకు రెండు నెలల ముందే ఇలా హడావుడి మొదలు పెట్టేసారు. ఏదేమైనాప్పటికీ నెగిటివ్ కామెంట్స్ అలాగే పాజిటివ్ కామెంట్స్ అన్నీ కూడా సినిమా ఓపెనింగ్ కు ఎంతో కొంత ఉపయోగపడతాయి. ఇక సంక్రాంతి ఫైట్ లో ఫ్యామిలీ స్టార్ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.