బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన పాప
తాజాగా ఈ వీడియో మరో ఉదాహరణగా నిలుస్తుందని బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 10 Jan 2025 11:38 AM GMTనందమూరి బాలకృష్ణ పైకి కఠువుగా కనిపిస్తారు కానీ ఆయనది చిన్న పిల్లల మనస్థత్వం అని చాలామంది అంటారు. ఆయనతో వర్క్ చేసిన వారు, ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. బాలకృష్ణకు కోపం ఎక్కువ అనేవారి కంటే ఆయన చిన్న పిల్లాడిగా ప్రవర్తిస్తాడు, ఆయన మంచితనం కు నిదర్శనం అంటూ చెప్పే వారు ఎక్కువ మంది ఉంటారు. కొందరు బాలకృష్ణను కోపిష్టి అంటూ ముద్ర పడే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ మంచి మనసున్న వ్యక్తి, ఆయనతో కలిసి వర్క్ చేసిన వారు మళ్లీ మళ్లీ ఆయనతో కలవాలని అనుకుంటారు.
ఇండస్ట్రీలోని హీరోల అందరిలోకి బాలకృష్ణ మంచి వాడు అంటూ ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని, తాజాగా ఈ వీడియో మరో ఉదాహరణగా నిలుస్తుందని బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. బాలకృష్ణ తాజాగా నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఆ సినిమాలో కీలక పాత్రలో వేద అనే చిన్న పాప నటించింది. ఆ పాపతో బాలకృష్ణకు కీలక సన్నివేశాలు ఉంటాయి. అందుకే ఆ పాపతో బాలకృష్ణ ఎక్కువ రోజులు కలిసి ఉండాల్సి వచ్చింది. ఆ పాపతో ఎక్కువ సమయం సరదాగా గడపడం జరిగింది.
డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆ పాప ఎమోషనల్ అయ్యింది. బాలకృష్ణతో షూటింగ్ పూర్తి అయ్యిందని తెలిసి, ఇక మీదట బాలయ్య ను కలవను అని తెలిసి ఆ పాప కన్నీళ్లు పెట్టుకుంది. వీడ్కోలు చెప్పలేక పోయింది. షూటింగ్ చివరి రోజు బాలకృష్ణకు వేద ఎమోషనల్‌గా ఇచ్చిన సెండాఫ్ వీడియో అందరికి హృదయాన్ని కదిలిచింది. ఆ పాప ఏడుపులో అభిమానం కనిపిస్తుంది. బాలకృష్ణపై ఆ పాపకు ఉన్న ఒక మంచి ప్రేమను చూడవచ్చు. అంతగా పాప కన్నళ్లు పెట్టుకుంది అంటే బాలకృష్ణ ఎంతగా ఆ పాపపై ప్రేమను కనబర్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
చిన్న పిల్లలతో పిల్లల మాదిరిగా కలిసి పోయి ఆడుకుంటూ ఉంటే వారు బాగా కనెక్ట్ అవుతారు. బాలకృష్ణ సన్నివేశాలు బాగా రావడం కోసం పాపతో మొదట రెండు మూడు రోజులు ఎక్కువగా సమయం గడపడం జరిగిందట. దాంతో పాప తన ఫ్యామిలీ మెంబర్ మాదిరిగా బాలకృష్ణను భావించి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యింది. అందుకే బాలకృష్ణను వదిలి వెళ్తున్నప్పుడు తల్లిని తండ్రిని వదిలి వెళుతున్నట్లుగా కన్నీళ్లు పెట్టుకుంది. ఇలాంటి అభిమానం సొంతం చేసుకోవడం కేవలం బాలకృష్ణకే సాధ్యం అంటూ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తున్నారు.